Social 1080×1350 • Multi-page
29-07-2026 BREAKING NEWS 09:07 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ లో ముగిసిన రెండు రోజుల తెలుగు కార్యశాల

హుజురాబాద్ లో ముగిసిన రెండు రోజుల తెలుగు కార్యశాల
IMG-20260729-WA0040

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శాతవాహన యూనివర్సిటీ తెలుగు విభాగం ఆధ్వర్యంలో సృజనాత్మక రచన, స్క్రిప్ట్ రచనా నైపుణ్యాలు” అనే అంశాలపై విద్యార్థులకు రెండు రోజుల కార్యశాల బుధవారం ముగిసింది.

మాట్లాడుతున్న తెలుగు అధ్యాపకులు ప్రొఫెసర్ మట్టా సంపత్ కుమార్
మాట్లాడుతున్న కళాశాల ప్రిన్సిపాల్ డా పి ఇందిరాదేవి

ఈ సందర్భంగా జరిగిన కార్యశాలలో తెలుగు అధ్యాపకులు ప్రొఫెసర్ మట్టా సంపత్ కుమార్ రెడ్, డాక్టర్ బట్టు విజయ్ కుమార్, కొండా ప్రవళిక , కళాశాల ప్రిన్సిపాల్ డా పి ఇందిరాదేవి, కార్యక్రమ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ కొత్తిరెడ్డి మల్లారెడ్డి కళాశాల అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ కె లింగారెడ్డి, డాక్టర్ బి. రేణుక, అధ్యాపకులు డాక్టర్ వి స్వరుపా రాణి, డాక్టర్ సరళ ఝాన్సి, పల్లవి, ఓదెలు, రమ, సుమలత, నరెందర్, మహిపాల్ రెడ్డి, స్వప్న, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు భాష అభివృద్ధి కోసం విద్యార్థులు ఎలాంటి మార్గాలను అవలంబించాలో వివరించారు. భాషా రచన లో నైపుణ్యం రావాలంటే మొదట భాష పైపట్టుత్వం ఉండాలని ఊ హా శక్తి, సృజనాత్మకత ఉండాలని జానపద సాహిత్యంపై అవగాహన ఉండాలని వివరించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థిని విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు.

సర్టిఫికెట్లతో విద్యార్థులు, అతిథులు..


@లోకల్ యాడ్స్@

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలుపుతున్నవారు: కృష్ణవేణి టాలెంట్ హై స్కూల్, హుజురాబాద్ కరీంనగర్ జిల్లా.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!