Social 1080×1350 • Multi-page
29-07-2026 BREAKING NEWS 09:52 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ లో భక్తిశ్రద్దలతో గురు పౌర్ణమి వేడుకలు

హుజురాబాద్ లో భక్తిశ్రద్దలతో గురు పౌర్ణమి వేడుకలు
IMG-20260729-WA0070

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని పంచే గురువులను పూజించే పవిత్ర పర్వదినం గురు పౌర్ణమిని బుధవారం హుజూరాబాద్ పట్టణంలో ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజును పురస్కరించుకొని విద్యాసంస్థల్లో గురుపూజలు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, భజనలు, అన్నదాన కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

పట్టణంలోని శ్రీగణపతి దత్తాత్రేయ సహిత షిరిడీ సాయిబాబా ఆలయంలో చైర్మన్ వెంపటి సదానందం, వేద పండితుడు వరుణ్ ఆధ్వర్యంలో గురుపౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయంలో కలుష పూజ. అభిషేకం, హారతి, మంత్ర పుష్పం, తీర్థప్రసాద వితరణ, పల్లకీ సేవ, విశేష పూజలను నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం రథయాత్ర నిర్వహించారు. కాగా దాతలను శాలువాలతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ఇనుగాల సత్తిబాబు, భూసారపు సంతోష్, రాజూరి రాజు, ప్రవీణ్. ఇంద్రకరణ్, అకినపల్లి శ్రావణ్, గంగిశెట్టి ప్రభాకర్, ప్రసాద్, విజయ, స్వరూప తదితరులు పాల్గొన్నారు.

అన్న వితరణ చేస్తున్న భక్తులు..


&లోకల్ యాడ్స్&

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్ హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!