Social 1080×1350 • Multi-page
30-07-2026 BREAKING NEWS 11:33 PM
swarnodayam.com
Telugu Daily News

మంత్రి పొన్నంను కలిసిన జిల్లా చేనేత సెల్ జిల్లా అధ్యక్షుడు సదానందం ..- మంత్రికి చిరు సత్కారం

మంత్రి పొన్నంను కలిసిన జిల్లా చేనేత సెల్ జిల్లా అధ్యక్షుడు సదానందం ..- మంత్రికి చిరు సత్కారం
IMG_20260730_232943

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : కరీంనగర్ జిల్లా చేనేత సెల్ జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన బండారి సదానందం ఈ రోజు కరీంనగర్ లో జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ ను మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం సదానందం కు అభినందనలు తెలియజేసి కాంగ్రెస్ పార్టీని మరియు చేనేత సంఘములను బలోపేతం చేయాలని కోరారు. ఎలాంటి అవసరం ఉన్న మంత్రిగా పూర్తి అండగా ఉంటానని తెలియజేసి సదానందమును తిరిగి సన్మానిచడం జరిగింది. ప్రత్యేకంగా హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రణవ్ బాబు సహకారంతో ముందుకు వెళ్లాలని సూచించారన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి నేరెళ్ల మహేందర్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాజీపేట శ్రీనివాస్, బీసీ నాయకులు కన్నబోయిన మహేందర్ పాల్గొన్నారు.


&లోకల్ యాడ్స్&

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు :క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్ హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!