Social 1080×1350 • Multi-page
01-08-2026 BREAKING NEWS 05:53 PM
swarnodayam.com
Telugu Daily News

అపోలో రీచ్ ఎన్‌ఎస్‌ఆర్ హాస్పిటల్‌లో మూడు రోజుల ప్రత్యేక ఉచిత యూరాలజీ క్యాంప్. –ప్రముఖ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డా. జి మోహన్ చంద్ ఆధ్వర్యంలో అత్యాధునిక పరీక్షలు, నిపుణుల వైద్య సేవలు

అపోలో రీచ్ ఎన్‌ఎస్‌ఆర్ హాస్పిటల్‌లో మూడు రోజుల ప్రత్యేక ఉచిత యూరాలజీ క్యాంప్. –ప్రముఖ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డా. జి మోహన్ చంద్ ఆధ్వర్యంలో అత్యాధునిక పరీక్షలు, నిపుణుల వైద్య సేవలు
IMG-20260801-WA0098

స్వర్ణోదయం ప్రతినిధి వరంగల్, ఆగస్టు01: మూత్రం సమయంలో మంట, తరచుగా మూత్రం రావటం, మూత్రంలో రక్తం కనిపించడం, కిడ్నీ/ వెన్ను నొప్పి, కిడ్నీలో రాళ్లు, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లు, ప్రోస్టేట్ గ్రంధి పెరుగుదల సమస్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో అపోలో రీచ్ ఎన్‌ఎస్‌ఆర్ హాస్పిటల్, కొత్తపేట, వరంగల్ ఆధ్వర్యంలో ఈ నెల 03, 04, 05 తేదీల్లో ప్రత్యేక యూరాలజీ క్యాంప్ నిర్వహించనున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది.

ఈ క్యాంప్‌లో ప్రముఖ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డా. జి మోహన్ చంద్ రోగులను ప్రత్యక్షంగా పరీక్షించి, వ్యాధి తీవ్రతను అంచనా వేసి అవసరమైన చికిత్సపై సమగ్ర సలహాలు అందించనున్నారు.
క్యాంప్ సందర్భంగా కంప్లీట్ బ్లడ్ కౌంట్, షుగర్ పరీక్ష, కంప్లీట్ మూత్ర పరీక్ష, క్రియాటినిన్, అల్ట్రా సౌండ్ స్కానింగ్ ( వైద్యుల సలహా మేరకు) అందించబడతాయి. అంతేకాకుండా ఇతర ఇన్వెస్టిగేషన్స్ పైన 50 శాతం వరకు ప్రత్యేక తగ్గింపు కూడా అందుబాటులో ఉంటుందని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది.

ఈ క్యాంప్ ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహించ బడుతుంది. కిడ్నీ సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి సరైన చికిత్స తీసుకోవడం ద్వారా తీవ్రమైన ఆరోగ్య సమస్యలను నివారించే అవకాశం ఉంటుందని వైద్యులు తెలిపారు.
ప్రజలు ముందస్తుగా తమ పేర్లు నమోదు చేసుకుని ఈ అరుదైన అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆసుపత్రి యాజమాన్యం కోరింది.
స్థలం: అపోలో రీచ్ ఎన్‌ఎస్‌ఆర్ హాస్పిటల్, కొత్తపేట క్రాస్ రోడ్, అరేపల్లి, వరంగల్ – 506006.
అపాయింట్‌మెంట్ & వివరాలకు: 94598 75555.


&& లోకల్ యాడ్స్ &&

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: న్యూ కాకతీయ మోడల్ స్కూల్, జమ్మికుంట రోడ్డు హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!