Social 1080×1350 • Multi-page
01-08-2026 BREAKING NEWS 07:23 PM
swarnodayam.com
Telugu Daily News

సాంకేతికతను అందించి రైతుల ఆదాయం పెంచాలి. – జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే

సాంకేతికతను అందించి రైతుల ఆదాయం పెంచాలి. – జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే
IMG_20260801_191556

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : రాబోయే ఐదేళ్ల కాలంలో ఆధునిక సాంకేతికతను నుంచి నాణ్యత పెంచి రైతులకు ఆదాయం పెంచాలని జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. శనివారం హుజూరాబాద్ పట్టణ శివారులోని కేసి క్యాంపులో గల రైతు వేదికలో పట్టు పరిశ్రమ భాగస్వామ్య సదస్సు కరీంనగర్ జిల్లాలో “నా పట్టు – నా అభిమానం 2.0” జిల్లా స్థాయి సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ….
భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెంట్రల్ సిల్క్ బోర్డు చేపట్టిన 100 రోజుల “మేరా రేషమ్ మేరా అభిమాన్ 2.0” కార్యక్రమం రైతులు ఉపయోగించుకోవాలన్నారు. శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని పట్టు రైతులకు చేరవేయడం, జిల్లాకు అనుగుణంగా ఐదేళ్ల అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అన్నారు.

డాక్టర్ రాఘవేంద్ర మాట్లాడుతూ….
ఎంఆర్‌ఎంఏ 2.0 అనేది 100 రోజుల ప్రత్యేక కార్యక్రమమని, ఇందులో రైతులతో ప్రత్యక్షంగా మమేకమై శాస్త్రీయ సాంకేతికతను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం, బేస్‌లైన్ సర్వే నిర్వహించడం, జిల్లాలోని పట్టు పరిశ్రమ పరిస్థితులను విశ్లేషించి వచ్చే ఐదేళ్లకు సమగ్ర జిల్లా పట్టు పరిశ్రమ అభివృద్ధి ప్రణాళిక రూపొందించడం జరుగుతుందని అన్నారు. డా. గులాబ్ ఖాన్ రోహెలా మాట్లాడుతూ…. సెంట్రల్ సిల్క్ బోర్డు అభివృద్ధి చేసిన ఆధునిక సాంకేతికతలను ప్రతి పట్టు రైతుకు అందించడం ద్వారా దిగుబడి, నాణ్యత, ఆదాయాన్ని పెంచడమే ఎంఆర్‌ఎంఏ 2.0 ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఏడిఏ జి సునీత మాట్లాడుతూ….పంటల వైవిధ్యీకరణ కార్యక్రమంలో భాగంగా చిన్న, సన్నకారు రైతులు సంవత్సరమంతా స్థిరమైన ఆదాయం పొందేందుకు పట్టు సాగును స్వీకరించేలా ప్రోత్సహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పట్టు పరిశ్రమ కు ఎదురవుతున్న పాలు అడ్డంకులను రైతులు అధికారులకు వివరించారు.

కార్యక్రమంలో జిల్లా పట్టు శాఖ సహాయ సంచాలకులు, జిల్లా నోడల్ అధికారి బనోత్ వెంకన్న, హుజూరాబాద్ వ్యవసాయ అధికారి భూమిరెడ్డితో, ఏఈఓ నిఖిల్, పట్టు రైతులు, చౌకీ పురుగుల పెంపకందారులు పాల్గొన్నారు.


@లోకల్ యాడ్స్@

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: న్యూ కాకతీయ మోడల్ స్కూల్, జమ్మికుంట రోడ్డు హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!