Social 1080×1350 • Multi-page
01-08-2026 BREAKING NEWS 08:11 PM
swarnodayam.com
Telugu Daily News

వృత్తి ధర్మంలో రాజలింగమూర్తి ఇతరులకు ఆదర్శం. – న్యాయమూర్తి పిబి కిరణ్ కుమార్

వృత్తి ధర్మంలో రాజలింగమూర్తి ఇతరులకు ఆదర్శం. – న్యాయమూర్తి పిబి కిరణ్ కుమార్
IMG-20260801-WA0129

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : న్యాయశాఖలో 37 ఏళ్లుగా వివిధ హోదాల్లో పనిచేస్తున్న పందిళ్ళ రాజలింగమూర్తి వృత్తి ధర్మం పాటించడంలో ఆయన ఇతరులకు ఎంతో ఆదర్శమని హుజురాబాద్ సీనియర్ సివిల్ జడ్జి పిబి కిరణ్ కుమార్ పేర్కొన్నారు.

హుజురాబాద్ విఎల్ఆర్ ఫంక్షన్ హాల్ లో హుజురాబాద్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు సీనియర్ సూపరింటిన్డెంట్ పందిళ్ళ రాజలింగమూర్తి పదవీ విరమణ సన్మాన సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రతిభ, కృషి నిజాయితీ, సమయపాలన, క్రమశిక్షణ, వినయం, పారదర్శకత తో ప్రతి పదవికి ఆయన వన్నె తెచ్చారని అన్నారు. ఈ సందర్భంగా మూర్తి దంపతులను సీనియర్ సివిల్ జడ్జి పిబి కిరణ్ కుమార్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పద్మ సాయి శ్రీ, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి వీణా ప్రణతి లతోపాటు వివిధ కోర్టుల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సన్మానించారు.

ఈ కార్యక్రమంలో పలు కోర్టులలో పనిచేసే ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొన్నారు.

#సన్మాన పత్రం..#


&&లోకల్ యాడ్స్&&

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: న్యూ కాకతీయ మోడల్ స్కూల్, జమ్మికుంట రోడ్డు హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!