Social 1080×1350 • Multi-page
02-08-2026 BREAKING NEWS 09:30 PM
swarnodayam.com
Telugu Daily News

ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ.. – త్రుటిలో తప్పిన భారీ ప్రమాదం.

ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ.. – త్రుటిలో తప్పిన భారీ ప్రమాదం.
IMG-20260802-WA0080

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణ శివారులోని కెసి కెనాల్ వద్ద గల వరంగల్ -కరీంనగర్ ప్రధాన రహదారిపై ఆదివారం హన్మకొండ వెళ్తున్న హుజురాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును వెనుక నుండి లారీ ఢీకొట్టింది. ఈ సంఘటనలో బస్సు అద్దాలు పగలగా జగిత్యాలకు చెందిన మనసకు స్వల్ప గాయమైంది. గాయపడ్డ వారిని హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. లారీ డ్రైవర్ అజాగ్రత్తగా లారీ నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగిందనీ, తృటిలో భారీ ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ఈ సమయంలో బస్సులో 33 మంది ఉండగా ఎవరికి పెద్దగా గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

బస్సును ఢీ కొట్టిన లారీ ఇదే..


@లోకల్ యాడ్స్@

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: మనీషా డిజిటల్ ఫోటో స్టూడియో అండ్ వీడియో గ్రాఫర్స్ హుజురాబాద్.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!