Social 1080×1350 • Multi-page
02-08-2026 BREAKING NEWS 11:50 PM
swarnodayam.com
Telugu Daily News

త్వరలోనే అన్ని కమిటీల కార్యవర్గాల ఏర్పాటు: ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి మంద రాజు

త్వరలోనే అన్ని కమిటీల కార్యవర్గాల ఏర్పాటు: ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి మంద రాజు
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : ఎమ్మార్పీఎస్, ఎంఎస్ పి, అనుబంధ సంస్థల కార్యవర్గాలను త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి మంద రాజు తెలిపారు. ఆదివారం హుజురాబాద్ లో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… హుజురాబాద్ మండలంలోని అన్ని గ్రామాలలో నూతన గ్రామ కమిటీలు, మండల కమిటీ, జెండా గద్దెల నిర్మాణంలపై చర్చించడం జరిగిందన్నారు. సెప్టెంబర్ 9నవరంగల్ లో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశం విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు రుద్రారపు రామచంద్రం, రాష్ట్ర నాయకులు మారపల్లి శ్రీనివాస్, జిల్లా నాయకులు తునికి వసంత్, దేవునూరి రవీందర్, ఎంఈఎఫ్ నాయకులు డాక్టర్ తడకమళ్ళ శేఖర్, కాలువల మల్లయ్య, మొళుగూరి నాగేష, తాడురీ సంపత్, బొడ్డు నగేష్,
శనిగరపు దిలీప్ తదితరులు పాల్గొన్నారు.


*లోకల్ యాడ్స్*

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: మనీషా డిజిటల్ ఫోటో స్టూడియో అండ్ వీడియో గ్రాఫర్స్ హుజురాబాద్.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!