Social 1080×1350 • Multi-page
03-08-2026 BREAKING NEWS 05:11 PM
swarnodayam.com
Telugu Daily News

చేల్పూర్ లో పంచాయతి రహదారుల ఆక్రమణ.. -అనుమతులు లేకుండానే రియల్ దందా. – 6 మాసాలుగా ఆ పంచాయతిలో ఇష్టారాజ్యం…

చేల్పూర్ లో పంచాయతి రహదారుల ఆక్రమణ.. -అనుమతులు లేకుండానే రియల్ దందా. – 6 మాసాలుగా ఆ పంచాయతిలో ఇష్టారాజ్యం…
IMG-20260803-WA0080

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగి 6 మాసాలు పూర్తి అయినప్పటికి ఆ గ్రామ పంచాయతి పరిధీలో అభివృద్ధి వనులకు ఇంతవరకు నోచుకోలేదు. పంచాయతి పాలకవర్గంలో 2 గ్రూపులుగా విడిపోయి అధిపత్య పోరుతోనే ఒక వర్గం పై మరోక వర్గం పోలీస్ స్టేషన్ లో దరఖాస్తులు చేసుకున్న వైనం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని చెల్పూర్ గ్రామ పంచాయితీలో చోటుచేసుకున్నాయి. పంచాయతీ పోరులో పాలకవర్గ గ్రూపులు ఉండగా గ్రామంలోని కొంత మంది భూ దందా నిర్వహించేవారు ఒకరు అయితే…

పంచాయతి అనుమతులు లేకుండానే రియల్ ఎస్టేట్ దందా నిర్వహిస్తూ, సిమెంట్ పోల్స్, కర్ర కొయ్యలు పంచాయతి రహదారులను ఆక్రమించుకోని ఇష్టారాజ్యంగా కొలతలు వేసుకుంటూ 8 లక్షలకు ఒక ప్లాటు అమ్ముకుంటున్నారు. గ్రామపంచాయతి లోని సిసి రోడ్లకు ఇరువైపులా పంచాయతీరాజ్ చట్టం ప్రకారంగా అటువైపు 5 ఫీట్లు… ఇటువైపు 5 ఫీట్లు వదిలి పెట్టి పర్మిషన్ తీసుకుని నిర్మాణాలు చేపట్టాలి. అలాంటిది గ్రామంలో పర్మిషన్లు లేకుండానే ఇష్టారాజ్యంగా నిర్మాణాలు కొనసాగుతున్నాయి.

గ్రామంలోని 1వ వార్డులో భూ దందాలు నిర్వహించే ఒక వ్యక్తి ఏకంగా పంచాయతి రహదారినే ఆక్రమించుకున్న సంఘటన గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. 1వ వార్డులో ఆర్టీసీ బస్టాండ్ సమీపాన గ్రామ పంచాయతి అనుమతులు లేకుండా, నాలా కన్వేన్షన్ అనుమతులు లేకుండా 8 లక్షలకు ఒక ప్లాటు అమ్ముకుంటున్నారు. గ్రామంలో గడిచిన 6 మాసాల కాలంలో పంచాయితీ రాజ్ శాఖ నిబంధనకు తూట్లు పొడుస్తూ ఇష్టారాజ్యంగా పంచాయతి సిసి రోడ్లను ఆనుకోని నిర్మాణాలు జరుగుతున్న గ్రామ పంచాయతి అధికారులు పట్టించుకోకపోవడం పట్ల గ్రామంలో ప్రజలు సర్వత్రా నిరనన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని అనేక వార్డులలో సిసి రోడ్ల పై ప్రహారి గోడల నిర్మాణాలు చేపట్టడం, మెట్లు కట్టడం, ర్యాంపులు చేపట్టె నిర్మాణాల పట్ల గ్రామంలోని అనేక వర్గాల ప్రజలు గ్రామంలో డబ్బులు ఉన్న వారికి ఒక న్యాయం, డబ్బులు లేని వారికి ఒక న్యాయమా… అంటూ వంచాయతి అధికారులను ప్రశ్నిస్తున్నారు?. గ్రామంలో పంచాయతి రోడ్ల ఆక్రమణాలపై జిల్లా పంచాయతిరాజ్ అధికారి, మండల అభివృద్ధి అధికారి తక్షణమే గ్రామంలో విచారణ జరిపి రానున్న భవిష్యత్తు తరాల కోసం మేజర్ గ్రామపంచాయతి పరిధీలో నిబంధనల ప్రకారం రోడ్లు వెడల్పు ఉండేలా చర్యలు తీసుకోవాలని చెల్పూర్ గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఆందోళనలు చేపట్టడానికి కూడా వెనకాడమని పలువురు గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు.


##లోకల్ యాడ్స్&&

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: నాగార్జున మిల్క్ ప్రొడక్ట్స్ డెయిరీ & గణపతి సీడ్స్, పరకాల క్రాస్ రోడ్ హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!