Social 1080×1350 • Multi-page
03-08-2026 BREAKING NEWS 06:11 PM
swarnodayam.com
Telugu Daily News

ఆల్ఫోర్స్ లో ఘనంగా బోనాల జాతర.. -పాల్గొన్న ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి.నరేందర్ రెడ్డి

ఆల్ఫోర్స్ లో ఘనంగా బోనాల జాతర.. -పాల్గొన్న ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి.నరేందర్ రెడ్డి
IMG-20260803-WA0130

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని ఆల్ఫోర్స్ జీనియస్ పాఠశాలలో సోమవారం రోజున తెలంగాణ రాష్ట్ర ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే బోనాల మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుకున్నారని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి.నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, నిర్వహించి బోనం సమర్పించారు.

అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, సిరిసంపదలు, విద్యా ప్రగతి, వ్యవసాయాభివృద్ధి, దేశాభివృద్ధితో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవమైన మహంకాళి అమ్మవారి బోనాల పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. బోనాల పండుగ కేవలం ఒక ఆధ్యాత్మిక ఉత్సవం మాత్రమే కాకుండా తెలంగాణ సంస్కృతి, ఐక్యత, భక్తి, సామాజిక సమైక్యతను చాటిచెప్పే మహోత్సవమని అన్నారు. ఇటువంటి సంప్రదాయ పండుగలను భావితరాలకు పరిచయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, యువత తమ సంస్కృతిని గౌరవించి పరిరక్షించాలని పిలుపునిచ్చారు. అమ్మవారి అనుగ్రహంతో విద్యార్థులు విద్యలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ప్రతి కుటుంబంలో ఆనందం, ఐశ్వర్యం వెల్లి విరియాలని ప్రార్థించారు.

బోనాల వేడుకల్లో ఆకట్టుకున్న చిన్నారుల వేషధారణలు..

మాట్లాడుతున్నఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి.నరేందర్ రెడ్డి

తదనంతరం గత నెలలో నిర్వహించినటువంటి హౌస్ ఎలక్షన్స్ లో గెలుపొందినటువంటి కెప్టెన్, వైస్ కెప్టెన్ లను సన్మానించారు. అలాగే ఎఫ్ ఏ-1 పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన వారినీ ఘనంగా సత్కరించారు. తదనంతరం జరిగినటువంటి సాంస్కృతి కార్యక్రమాలలో విద్యార్థులు పోతరాజులు వేషా ధారణలో అందరిని అలరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


##లోకల్ యాడ్స్##

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: నాగార్జున మిల్క్ ప్రొడక్ట్స్ డెయిరీ & గణపతి సీడ్స్, పరకాల క్రాస్ రోడ్ హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!