Social 1080×1350 • Multi-page
04-08-2026 BREAKING NEWS 11:27 PM
swarnodayam.com
Telugu Daily News

హిందీ నటుడు ప్రదీప్ రావత్(74) గుండెపోటుతో మృతి

హిందీ నటుడు ప్రదీప్ రావత్(74) గుండెపోటుతో మృతి
IMG-20260804-WA0183

బ్లడ్ క్లాట్ అవడంతో ప్రదీప్ రావత్ కు గుండెపోటు

స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్: హిందీ నటుడు ప్రదీప్ రావత్(74) ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం 5.30కి తుది శ్వాస విడిచారు.

ఎస్ ఎస్ రాజమౌళి ‘సై’ సినిమాతో టాలీవుడ్ కి ప్రదీప్ రావత్ పరిచయమయ్యాడు. ఛత్రపతి, భద్ర సినిమాలతో విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

టాలీవుడ్ లో చివరిగా గాయపడ్డ సింహం సినిమాలో ప్రదీప్ కనిపించారు. సౌత్ లో 70 సినిమాలకు పైగా ప్రదీప్ రావత్ నటించారు. బాలీవుడ్ లో లగాన్ సినిమాతో మంచి గర్తింపు తెచ్చుకున్నారు.

ఒక్కగానొక్క కుమారుడిని హీరో చేయాలనే ప్రయత్నంలో ఉండగా ఆ కోరిక తీరకుండానే ప్రదీప్ రావత్ మరణించడం అత్యంత బాధాకరం. ఆయన మృతి పట్ల సినీ నటులు, దర్శకులు పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!