Social 1080×1350 • Multi-page
05-08-2026 BREAKING NEWS 10:36 PM
swarnodayam.com
Telugu Daily News

20వ వార్డులో ఘనంగా ‘మెహందీ’ వేడుకలు: -ఆడపడుచులకు వార్డు కౌన్సిలర్ ఆత్మీయ మర్యాదలు

20వ వార్డులో ఘనంగా ‘మెహందీ’ వేడుకలు: -ఆడపడుచులకు వార్డు కౌన్సిలర్ ఆత్మీయ మర్యాదలు
IMG-20260805-WA0094


​మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ పురపాలక సంఘం
​ 20వ వార్డులో మెహందీ వేడుకలు కన్నుల పండువగా సాగాయి. వార్డు పరిధిలోని మహిళలు, యువతులు విశేష సంఖ్యలో పాల్గొనడంతో ప్రాంగణమంతా పండుగ వాతావరణం సంతరించుకుంది.

ఆడపడుచులకు పసుపు, కుంకుమలు, గాజులు ఇచ్చి ఆత్మీయ సత్కారం చేస్తున్న వార్డు కౌన్సిలర్ అనూష..

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన స్థానిక వార్డు కౌన్సిలర్ దామెర అనూష అనురాగ్, వేడుకల్లో పాల్గొన్న ఆడపడుచులందరికీ పసుపు, కుంకుమలు, గాజులు బహుకరించి తమ సొంత ఇంటి ఆడపడుచుల్లా ఆత్మీయంగా ఆదరించారు.

​ఈ సందర్భంగా కౌన్సిలర్ దామెర అనూష అనురాగ్ మాట్లాడుతూ.. వార్డులోని మహిళలందరినీ ఒకే చోటకు చేర్చి, మన సాంప్రదాయాలను గౌరవిస్తూ ఇలాంటి వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషాన్నిస్తుందన్నారు. వార్డు ప్రజల సంక్షేమం, మహిళల ఆత్మగౌరవానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు.
​కౌన్సిలర్ చూపిన ఆప్యాయత, ఇచ్చిన ఆత్మీయ సత్కారాలకు వార్డు మహిళలు హర్షం వ్యక్తం చేస్తూ, ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు ముఖ్య నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


& లోకల్ యాడ్స్ &

హుజురాబాద్ జిల్లా పరిషత్ సెకండరీ బాలికల పాఠశాలలో వృత్తి విద్య ఉపాధ్యాయుడుగా పనిచేసి పదవీ విరమణ పొందిన మ్యాక రాములు గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: రిటైర్డ్ పిడి సొల్లు సారయ్య, హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!