Social 1080×1350 • Multi-page
06-08-2026 BREAKING NEWS 07:33 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ లో ఘనంగా జయశంకర్ జయంతి వేడుకలు

హుజురాబాద్ లో ఘనంగా జయశంకర్ జయంతి వేడుకలు
IMG-20260806-WA0076

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ మునిసిపాలిటీలో, అమరవీరుల స్తూపం వద్ద, అంబేద్కర్ చౌరస్తా వద్ద గురువారం అధికారులు వివిధ ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు ఘనంగా జరిపారు.

-మున్సిపల్ కార్యాలయంలో

మున్సిపల్ కార్యాలయంలో జయశంకర్ 92వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రోoటాల సుహాసిని, మున్సిపల్ కమిషనర్ బి కిషన్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు అధికారులు పాల్గొన్నారు.

–బీసీ జేఏసీ, పూలే కమిటీల ఆధ్వర్యంలో

హుజురాబాద్ పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద బీసీ జేఏసీ, పూలే కమిటీల ఆధ్వర్యంలో జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జయశంకర్ తెలంగాణకు చేసిన సేవలను వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ గౌరవాధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షుడు సందేల వెంకన్న,
పూలే కమిటీ అధ్యక్షుడు చల్లూరి రఘుచారి, మహిళా జనరల్ సెక్రెటరీ దేవసాని ప్రియదర్శిని, నాయకులు చిలుకమారి శ్రీనివాస్, సాగర్, క్రాంతి కుమార్, శంకర్, భువనచంద్ర, సృజన, సాల్మన్, అశోక్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

మనుమయ సంఘం ఆధ్వర్యంలో

ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా హుజురాబాద్ మనుమయ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహించారు. జయశంకర్ సార్ ఆశయాలను కొనసాగించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మనుమయ సంఘ అధ్యక్షుడు నందగిరి శ్రీనివాస్, తాటికొండ శ్రీనివాస్, రాంపల్లి బిక్షపతి, బాణాల వివేకానంద, రావుల సురేందర్, బాణాల సత్యనారాయణ, రాజకుమార్, నరసింహచారి, లింగమూర్తి, మల్లాచారి, రాజేష్, మనమాయ సంఘ సభ్యులు పాల్గొన్నారు


&లోకల్ యాడ్స్&

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: న్యూ శాతవాహన హై స్కూల్, సూపర్ బజార్ రోడ్(ఇందిరా మార్గ్) హుజూరాబాద్, కరీంనగర్ జిల్లా.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!