Social 1080×1350 • Multi-page
06-08-2026 BREAKING NEWS 10:14 PM
swarnodayam.com
Telugu Daily News

ఆకట్టుకున్న టెట్రా మాన్సూన్ వేడుకలు

ఆకట్టుకున్న టెట్రా మాన్సూన్ వేడుకలు
IMG-20260806-WA0115

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలోని టెట్రా హెడ్రన్ హైస్కూల్లో గురువారం మాన్సూన్ ఫెస్టివల్ కార్యక్రమంను ఎంఈఓ ప్రారంభించగా ఆహుతులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా విద్యార్థులు మాంసోన్ కు స్వాగతం పలికారు. వర్షాల వల్ల ప్రయోజనాలు ఏరువాక, ఈ సీజన్ లో వచ్చే ముఖ్య పండుగలు బోనాలు, రక్షాబంధన్, వినాయక చవితి, కృష్ణాష్టమి, డాక్టర్స్ డే, ఫాథర్స్ డే, యోగ డే లపై ప్రదర్శనలు ఇచ్చారు. పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా వీటిని ప్రదర్శించడంతో ఆసక్తిగా చూశారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ మండల విద్యాధికారి విడపు శ్రీనివాస్, పాఠశాల కరెస్పాండంట్ ముచ్చ నారాయణరెడ్డి, డైరెక్టర్స్ టి రమణారెడ్డి, కోరం సంజీవరెడ్డి, సంపత్ రెడ్డి, రాజి రెడ్డి, సంతోష్ రావు, పాఠశాల అడ్వైసర్ సత్యనారాయణ, ప్రిన్సిపాల్ నరేష్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న మాన్సూన్ ఫెస్టివల్ వేడుకలు..

వేడుకలను తిలకిస్తున్న ఎంఈఓ శ్రీనివాస్, కరస్పాండెంట్ నారాయణరెడ్డి, ప్రిన్సిపాల్ తదితరులు..


##లోకల్ యాడ్స్##

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: న్యూ శాతవాహన హై స్కూల్, సూపర్ బజార్ రోడ్(ఇందిరా మార్గ్) హుజూరాబాద్, కరీంనగర్ జిల్లా.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!