Social 1080×1350 • Multi-page
07-08-2026 BREAKING NEWS 07:50 PM
swarnodayam.com
Telugu Daily News

వీఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో ఘనంగా బోనాలు, గోరింటాకు వేడుకలు

వీఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో ఘనంగా బోనాలు, గోరింటాకు వేడుకలు
IMG-20260807-WA0069

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, ఆగస్టు 7: హుజురాబాద్ మండలం సింగాపురంలోని వీఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో శుక్రవారం బోనాలు మరియు గోరింటాకు కార్యక్రమాన్ని విద్యార్థులు, అధ్యాపకులు ఎంతో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా విద్యార్థినులు సంప్రదాయ వస్త్రధారణలో బోనాలను తలపై మోసుకుంటూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థినులు గోరింటాకు పెట్టుకుని, సంప్రదాయ పాటలు, నృత్యాలతో సందడి చేశారు. విద్యార్థులు కూడా ఉత్సాహంగా పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. కళాశాల ప్రాంగణం రంగురంగుల అలంకరణలతో, సాంస్కృతిక వాతావరణంతో కళకళలాడింది.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ టి. అజయ్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులకు తెలంగాణ ఆచారాలు, సంప్రదాయాలపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు విద్యతో పాటు సంస్కృతి, సంప్రదాయాలను కూడా పరిరక్షించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ టి. అజయ్ కుమార్, జి. తిరుపతి, కోమల, రమాదేవి, హరీష్, ,సదయ్య, మహేష్, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


&లోకల్ యాడ్స్&

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: న్యూ శాతవాహన హై స్కూల్, ఇందిరా మార్గ్ హుజూరాబాద్, కరీంనగర్ జిల్లా.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!