Social 1080×1350 • Multi-page
08-08-2026 BREAKING NEWS 10:01 PM
swarnodayam.com
Telugu Daily News

ఐదో వార్డులో ఘనంగా మెహేందీ వేడుకలు

ఐదో వార్డులో ఘనంగా మెహేందీ వేడుకలు
IMG-20260808-WA0105

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలోని
5వ వార్డులో కౌన్సిలర్ సొల్లు సునీత ఆధ్వర్యంలో శనివారం మహిళలు మెహిందీ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఉదయం మహిళలంతా ఒకచోట చేరి గోరింటాకును దంచి సిద్ధం చేశారు. అనంతరం పాటలు పాడుతూ మహిళలు ఒకరికొకరు గోరింటాకును పెట్టుకున్నారు.

ఐదవ వార్డులో మెహందీ వేడుకలు నిర్వహిస్తున్న కౌన్సిలర్ సునీత..

ఈ సందర్భంగా కౌన్సిలర్ సునీత మాట్లాడుతూ…
ఆషాడ మాసంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం సాంప్రదాయం అని, అది ఎర్రగా పండితే వారి బ్రతుకులు పండుతాయి అని ఒక నమ్మకం, విశ్వాసం అన్నారు. ఈ సాంప్రదాయాన్ని మతాలకతీతంగా కులాలకతీతంగా వర్గాలకు అతీతంగా ఈ పండుగను జరుపుకుంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐదవ వార్డు మహిళ లు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!