Social 1080×1350 • Multi-page
09-08-2026 BREAKING NEWS 09:18 AM
swarnodayam.com
Telugu Daily News

శస్త్ర పబ్లిక్‌ స్కూల్‌లో ఘనంగా బోనాల వేడుకలు

శస్త్ర పబ్లిక్‌ స్కూల్‌లో ఘనంగా బోనాల వేడుకలు
IMG-20260809-WA0009

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్‌ పట్టణంలోని శస్త్ర పబ్లిక్‌ స్కూల్‌లో ముందస్తు బోనాల పండుగ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి బోనాల పండుగ ప్రత్యేకతను చాటిచెప్పారు. విద్యార్థులు బోనాలను అలంకరించి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో సమర్పించారు. పండుగ విశిష్టత, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించారు.


విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. పాఠశాల ఆవరణలో పండుగ వాతావరణం నెలకొనగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
సంప్రదాయ పండుగలను విద్యార్థులకు పరిచయం చేయడం ద్వారా మన సంస్కృతిని పరిరక్షించేందుకు కృషి చేస్తున్నామని పాఠశాల కరస్పాండెంట్ వేణుమాధవ్ తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!