Social 1080×1350 • Multi-page
09-08-2026 BREAKING NEWS 07:38 PM
swarnodayam.com
Telugu Daily News

కరాటే లో అద్భుత ప్రతిభ కనబరిచిన హుజురాబాద్ విద్యార్థులు

కరాటే లో అద్భుత ప్రతిభ కనబరిచిన హుజురాబాద్ విద్యార్థులు
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో రాష్ట్రస్థాయి కరాటే పోటీలు జరగగా హుజురాబాద్ పట్టణానికి చెందిన 12 మంది కరాటే విద్యార్థిని, విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి మెడల్స్ సాధించారని గ్లోబల్ శోటోకాన్ కరాటే డు ఇండియా జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు, బ్లాక్ బెల్ట్ కరాటే మాస్టర్ ఎస్కే జలీల్ తెలిపారు. ఆదివారం జరిగిన రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు సుమారు 400 మంది విద్యార్థులు హాజరు కాగా హుజురాబాద్ కు చెందిన తన విద్యార్థులు కరాటే లోని వివిధ అంశాల్లో బహుమతులు పొందారని తెలిపారు.

బహుమతులు సాధించిన వారిలో
ఎస్కే సాదుల్లా బాబా కటాస్ స్పారింగ్ లో గోల్డ్, సిల్వర్ మెడల్స్, ఎం భానుతేజ కటాస్ లో గోల్డ్ మెడల్, సిహెచ్ సాయిచరణ్ కటాస్, స్పారింగ్ లో రెండు గోల్డ్ మెడల్స్, జున్ను కావ్య కటాస్ లో గోల్డ్ మెడల్, ఎండి హుమేరా తస్లీమ్ కటాసులో గోల్డ్ మెడల్, పి సహస్ర కటాస్ లో గోల్డ్ మెడల్, పి కిరణ్ మై కటాస్ లో గోల్డ్ మెడల్, వి వినూత్న కటాస్ లో గోల్డ్ మెడల్, ఎండి సహారా గోల్డ్ మెడల్, జి నక్షత్ర కటాస్ లో గోల్డ్ మెడల్, హేమ కటాస్ లో గోల్డ్ మెడల్, నిస్సి గోల్డ్ మెడల్, జర ఎల్లో బెల్ట్ సాధించిందని చెప్పారు. కరాటేలో అద్భుత ప్రతిభ చూపిన విద్యార్థిని విద్యార్థులను పలువురు అభినందించారు.


&& లోకల్ యాడ్స్ &&

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాల హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!