Social 1080×1350 • Multi-page
09-08-2026 BREAKING NEWS 08:55 PM
swarnodayam.com
Telugu Daily News

అపూర్వoగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

అపూర్వoగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని సాయి కన్వెన్షన్ హాల్లో వెన్కేపల్లి – సైదాపూర్ జెడ్ పిహెచ్ ఎస్ లో 1983–84 పదవ తరగతి విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్యంలో తమకు విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులను వేదికపైకి పిలిపించుకొని వారికి ఘన సన్మానం చేశారు.
ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ పాఠశాల రోజుల్లోని మధుర జ్ఞాపకాలను, తరగతి గది అనుభవాలను, ఉపాధ్యాయుల బోధనను, చిన్ననాటి అల్లరిని, కలిసి గడిపిన అమూల్యమైన క్షణాలను నెమరు వేసుకున్నారు. కొందరు మిత్రులను ఇన్నేళ్ల తర్వాత చూడడానికి ఆనంద అనుభూతికి లోనయ్యారు. తల్లిదండ్రుల తర్వాత తమ జీవితానికి దిశానిర్దేశం చేసిన గురువుల సేవలను గుర్తుచేసుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించారు.
ఈ సమ్మేళనం స్నేహం, ఆత్మీయత, పాఠశాల జ్ఞాపకాలు, గురువుల పట్ల కృతజ్ఞత అనే నాలుగు భావాలను ఒకే వేదికపై కలిపిన మరపురాని వేడుకగా నిలిచింది.

ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు కస్తూరి ఆంజనచారి, లక్కాకుల రాంప్రసాద్, అయిత ఈశ్వర ప్రసాద్, కనుకుంట్ల ఈశ్వరప్రసాద్,
తదితరులు పాల్గొన్నారు
.


##లోకల్ యాడ్స్ ##

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాల హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!