Social 1080×1350 • Multi-page
10-08-2026 BREAKING NEWS 10:00 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ లో ఘనంగా కేసిరెడ్డి జన్మదిన వేడుకలు

హుజురాబాద్ లో ఘనంగా కేసిరెడ్డి జన్మదిన వేడుకలు
IMG-20260810-WA0179

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: 32 ఏళ్లుగా పత్రికా రంగంలో పని చేస్తూ తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుండి రాష్ట్ర సాధన కోసం నిరంతరం శ్రమించిన కేసిరెడ్డి నర్సింహారెడ్డి హుజురాబాద్, హుస్నాబాద్ రెండు నియోజవర్గాల్లో ఎంతో మంది రాజకీయ నాయకులు, అభిమాలను సంపాదించుకున్నారు. హుజురాబాద్ మున్సిపల్ లో వారి సతీమణి లావణ్యను నాలుగు సార్లు కౌన్సిలర్ గా గెలిపించుకొని హుజురాబాద్ మున్సిపల్ లోనే ఒకే వార్డు నుండి ఇప్పటి వరకూ గ్రామ, మున్సిపల్ ఎన్నికల్లో రికార్డులు సృష్టించి, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్న నర్సింహారెడ్డి 54వ బర్త్ డే వేడుకలు 26 వార్డులో అభిమానులు ఘనంగా నిర్వహించారు.

జన్మదిన వేడుకల దృశ్యాలు మరియు మొక్క నాటుతున్న నరసింహారెడ్డి

సూపర్ బజార్ రోడ్ లో కోలాహలం మధ్య యూత్, పాపారావు బొంద వ్యాపారులు, గణేష్ భక్త మండలి తదితరులు ఉదయం నుంచి సాయంత్రం వరకూ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు లో మొక్కలు నాటారు. పలువురు రాజకీయ నాయకులు, వివిధ పార్టీల నేతలు, దళిత, ప్రజా సంఘాల నేతలు, పాత్రికేయులు నరసింహారెడ్డికి ఫోన్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!