Social 1080×1350 • Multi-page
10-08-2026 BREAKING NEWS 10:59 PM
swarnodayam.com
Telugu Daily News

అంబేద్కర్, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వర్దినేని రవీందర్ రావుకు ఘన సన్మానం.

అంబేద్కర్, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వర్దినేని రవీందర్ రావుకు ఘన సన్మానం.
IMG-20260810-WA0180

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఆల్ ఇండియా సంఘం అంబేద్కర్ సంఘం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహాసేన, బిసి ఆజాద్ ఫెడరేషన్, ఆర్టిఐ , హ్యూమన్ రైట్స్ మరియు చేనేత సంఘాల ఆధ్వర్యంలో పర్యావరణ సామాజిక కార్యకర్త మున్సిపల్ కౌన్సిలర్ వర్దినేని రవీందర్రావుకు సోమవారం ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా మాడుగుల ఓదెలు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ సూచించిన పే బ్యాక్ టు ది సొసైటీ సిద్ధాంతాన్ని స్ఫూర్తిగా తీసుకొని రవీందర రావు ఎందరో పేదవర్గాల పిల్లలకు విద్య , ఉపాధి కోసం ఆర్దిక సహాయం అందించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెట్లు నాటి పర్యావరణ సమతుల్యాతకు కృషి చేశారు. ఆయన సేవలు నిరంతరం పేద వర్గాల పిల్లల భవిష్యత్ అభివృద్ధికి అందించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాడుగుల ఓదెలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహాసేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోడూరి సమ్మయ్య, ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం డివిజన్ అధ్యక్షులు రామగిరి అంకుస్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ వంతడుగుల బాబు, బీసీ ఆజాద్ ఫెడరేషన్ నాయకులు చిలుకమారి శ్రీనివాస్, పద్మశాలి సంఘం నాయకులు సంగేమ్ సత్యనారాయణ, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కాయిత రాములు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తడికమళ్ళ శేఖర్, బిసి సంక్షేమ సంఘం మహిళ జనరల్ సెక్రటరీ దేవసాని ప్రియదర్శిని, ఆర్టిఐ చట్టం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లూరు రాజేందర్, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు రుద్రారపు రామచంద్రం, శ్రీనివాస్, తునికి వసంత్, తెలంగాణ అంబేద్కర్ సంఘం నాయకులు తునికి సమ్మయ్య, చేనేత ఐక్యవేదిక ఉపాధ్యక్షురాలు బింగి రాణి, సృజన, చల్లూరు నిరోషా, షాదిక్, ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాస్, సమ్మయ్య, సదానందం మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!