Social 1080×1350 • Multi-page
12-08-2026 BREAKING NEWS 07:37 PM
swarnodayam.com
Telugu Daily News

క్షేత్ర పర్యటనకు వెళ్లిన విద్యార్థులు

క్షేత్ర పర్యటనకు వెళ్లిన విద్యార్థులు
IMG-20260812-WA0126

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలోని న్యూ శాతవాహన హై స్కూల్ విద్యార్థులు బుధవారం వ్యవసాయరంగం గురించి తెలుసుకోవడానికి
విద్యార్థులు వరి పొలాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు రైతులు నాట్లు వేసే విధానం గురించి అడిగి తెలుసుకోవడమే కాకుండా ప్రత్యక్షంగా పరిశీలించారు. వరి పంట పండడానికి ఎలాంటి వాతావరణ పరిస్థితులు నీటి పరిస్థితులు ఉండాలో రైతులు పిల్లలకు వివరించి చెప్పారు. తమ పిల్లలకు చదువుతోపాటు క్షేత్ర పర్యటనలు చేయించడం ద్వారా మరింత విజ్ఞానాన్ని అందిస్తున్నట్లు పాఠశాల కరస్పాండెంట్ వకుళాభరణం వెంకటేశ్వర్లు అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సరిత, రాజేష్, దివ్య, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!