Social 1080×1350 • Multi-page
12-08-2026 BREAKING NEWS 08:12 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ లో ఘనంగా జాతీయ గ్రంథాలయ దినోత్సవం వేడుకలు.

హుజురాబాద్ లో ఘనంగా జాతీయ గ్రంథాలయ దినోత్సవం వేడుకలు.
IMG-20260812-WA0143

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : జాతీయ గ్రంథాలయ దినోత్సవ వేడుకలు బుధవారం హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో, గ్రంథాలయంలో పాఠకులు ఉపాధ్యాయుల మధ్య ఘనంగా జరిగాయి.
—గ్రంథాలయంలో…

హుజురాబాద్ పట్టణంలోని గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయ దినోత్సవం వేడుకలు పురస్కరించుకొని పాఠకులు డాక్టర్ ఎస్ ఆర్ రంగనాథన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హెల్పర్ జ్యోతి, పాఠకులు తిరునహరి రమేష్, గంగిశెట్టి జగదీశ్వర్, రొంటాల బుచ్చయ్య, సొల్లు బాబు, రంగయ్య, సత్యనారాయణ, ఏవి నారాయణ, రమేష్, శ్రీనివాస్, శేఖర్ పాల్గొన్నారు.
—జూనియర్ కళాశాలలో…..

జాతీయ గ్రంథాలయ దినోత్సవ వేడుకలను ఇన్చార్జి ప్రిన్సిపాల్ సుగుణ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పద్మశ్రీ డాక్టర్ ఎస్సార్ రంగనాథన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రంథాలయ ఉద్యమానికి రంగనాథం చేసిన సేవలను వారు కొనియాడారు. గ్రంధాలయాలకు చేసినటువంటి సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు ప్రసాద్ విజయేందర్ రెడ్డి వాసుదేవరావు రాజశేఖర్ మురళీమోహన్ లైబ్రేరియన్ రాజేశం తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు నోటు బుక్కులను పంపిణీ చేశారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!