Social 1080×1350 • Multi-page
14-08-2026 BREAKING NEWS 05:31 PM
swarnodayam.com
Telugu Daily News

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. -డాక్టర్ జరీనా

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. -డాక్టర్ జరీనా
IMG-20260814-WA0051

—26వ వార్డు లో ఉచిత వైద్య శిబిరం

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని 26వ వార్డులో శుక్రవారం చెల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మామిండ్లవాడ ఆరోగ్య ఉప కేంద్రం ఆధ్వర్యంలో డాక్టర్లు, సిబ్బంది ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. స్థానిక పాత వెంకటేశ్వర టాకీస్ లో సిబ్బంది పరీక్షలు నిర్వహించి, వర్షాకాలం సీజన్లో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, ఇంటి చుట్టూ ప్రక్కల చెత్త చెదారం లేకుండా చూడడం పరిసరాలు శుభ్రంగా ఉంచడం ద్వారా వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చని డాక్టర్ జరీనా పేర్కొన్నారు. మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధుల పట్ల సూచనలు ఇవ్వడం జరిగింది. బీపీ, షుగర్ టెస్టులు నిర్వహించి అవసరం ఉన్న వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మధుకర్ నేతృత్వంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు లోని 35 మందికి పరీక్షలు నిర్వహించి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ కేసిరెడ్డి లావణ్య, హెల్త్ అసిస్టెంట్ లు వసంత, సత్తయ్య, ఆశ కార్యకర్తలు అలివేణి, భాగ్యలు పాల్గొన్నారు.

26వ వార్డులో ప్రజలకు వైద్య పరీక్షలు చేస్తున్న వైద్యులు, సిబ్బంది..


&& లోకల్ యాడ్స్ &&

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు : ఆల్ ఫోర్స్ జీనియస్ స్కూల్ బండ అంకుస్ వాడ హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!