Social 1080×1350 • Multi-page
14-08-2026 BREAKING NEWS 06:14 PM
swarnodayam.com
Telugu Daily News

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై కేసు ఉప సంహరించుకోవాలి. – ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శి కాయిత రాములు, కామని రవీందర్ లు డిమాండ్. – హుజూరాబాద్‌లో ధర్నా, రాస్తారోకో.. -​అంబేద్కర్ చౌరస్తాలో నిరసన హోరు. -​జర్నలిస్టుల ఆందోళనకు ప్రజాసంఘాలు, బీఆర్ఎస్ మద్దతు.​

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై కేసు ఉప సంహరించుకోవాలి. – ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శి కాయిత రాములు, కామని రవీందర్ లు డిమాండ్. – హుజూరాబాద్‌లో ధర్నా, రాస్తారోకో.. -​అంబేద్కర్ చౌరస్తాలో నిరసన హోరు. -​జర్నలిస్టుల ఆందోళనకు ప్రజాసంఘాలు, బీఆర్ఎస్ మద్దతు.​
IMG-20260814-WA0072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని జర్నలిస్టుల నివేశన స్థలాల అంశంపై కాంగ్రెస్ నాయకుడు గూడూరు స్వామిరెడ్డి కోర్టులో దాఖలు చేసిన కేసును తక్షణమే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ హుజూరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో భారీ ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.

ఈ సందర్భంగా స్వామిరెడ్డి వైఖరిని నిరసిస్తూ జర్నలిస్టులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇకచేపట్టిన ఈ ఆందోళన కార్యక్రమానికి పలు ప్రజాసంఘాల నాయకులు, బీఆర్ఎస్ శ్రేణులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

ఈ నిరసనను ఉద్దేశించి హుజూరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శి కాయిత రాములు, కామని రవీందర్ లు మాట్లాడుతూ… పట్టణంలో జర్నలిస్టులు గత రెండు దశాబ్దాలుగా నివేశన స్థలాల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారని గుర్తుచేశారు. గత ప్రభుత్వ హయాంలో కేసీ క్యాంప్ పరిధిలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించారని, ఇప్పటికే పలువురు జర్నలిస్టులు అక్కడ నివాసాలు కూడా నిర్మించుకున్నారని తెలిపారు. సమస్య పరిష్కారం కోసం ఇప్పటికే ఎంతోమంది ప్రజాప్రతినిధులకు, ఉన్నతాధికారులకు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
​ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకుడు స్వామిరెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తూ, జర్నలిస్టుల స్థలాలపై న్యాయస్థానంలో కేసు వేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని, సమస్యను సామరస్యంగా పరిష్కరించి జర్నలిస్టులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు తమ పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా కళాకారులు ఆలపించిన గీతాలు పలువురుని ఆకట్టుకున్నాయి.
​ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన జర్నలిస్టులు, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, ప్రజాసంఘాల బాధ్యులు, చందుపట్ల జనార్ధన్, వేల్పుల రత్నం, వేల్పుల ప్రభాకర్, దేవసాని ప్రియదర్శిని, తునికి సమ్మయ్య, సందెల వెంకటేష్, మాడుగుల ఓదెలు, గడ్డం విశాల్, కౌన్సిలర్లు గందే శ్రీనివాస్, వర్థినేని రవీందర్రావు, బిఆర్ఎస్ నాయకులు ప్రతాప తిరుమల్ రెడ్డి, అపరాధ ముత్యం రాజు, అకెనపల్లి శిరీష, కొలిపాక సమ్మయ్య తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


&& లోకల్ యాడ్స్ &&

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు : ఆల్ ఫోర్స్ జీనియస్ స్కూల్ బండ అంకుస్ వాడ హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!