Social 1080×1350 • Multi-page
14-08-2026 BREAKING NEWS 07:33 PM
swarnodayam.com
Telugu Daily News

ప్రభుత్వ భూములను రక్షించండి. – ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు కొలిపాక సమ్మయ్య

ప్రభుత్వ భూములను రక్షించండి. – ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు కొలిపాక సమ్మయ్య
IMG_20260814_192630

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలోని గణేష్ నగర్ లోని ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేయకుండా సంరక్షించాలని హుజురాబాద్ ఆర్డీవో జల కుమారి నాయక్ వాకిడీ కి వినతి పత్రం అందజేసినట్లు ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు కొలిపాక సమ్మయ్య తెలిపారు.

శుక్రవారం ఆయన మాట్లాడుతూ… గణేష్ నగర్ లోని సర్వే నంబర్ 236లో దాదాపు 4 ఎకరాల భూమిని కొందరు అనర్హులు ప్రభుత్వ ఉద్యొగులు సంపన్నులు కబ్జాలు చేసి అక్రమంగా పట్టాలు పొందాలని చూస్తున్నారని అన్నారు.
నిరుపేదలకు డబుల్ బెడ్రూంలు నిర్మించడానికి గత ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూములను కాపాడి మళ్ళీ పేదలకు చెందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంతే కాకుండా హుజురాబాద్ లో ప్రభుత్వ భూములు చెరువుల, వాగుల భూములు యథేచ్ఛగా కబ్జాలు చేస్తున్నారని అన్నారు. వాటిని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సంఘo నాయకుడు షేక్ కౌసర్ ఉన్నారు.


&& లోకల్ యాడ్స్ &&

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు : ఆల్ ఫోర్స్ జీనియస్ స్కూల్ బండ అంకుస్ వాడ హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!