Social 1080×1350 • Multi-page
14-08-2026 BREAKING NEWS 09:32 PM
swarnodayam.com
Telugu Daily News

విద్యకు దూరమైన వారికి ఓపెన్ స్కూల్ మంచి అవకాశం..- ఓపెన్ టెన్త్, ఇంటర్‌లో ప్రవేశాలు సద్వినియోగం చేసుకోవాలి. – జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

విద్యకు దూరమైన వారికి ఓపెన్ స్కూల్ మంచి అవకాశం..- ఓపెన్ టెన్త్, ఇంటర్‌లో ప్రవేశాలు సద్వినియోగం చేసుకోవాలి. – జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
IMG-20260814-WA0098

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: విద్యకు దూరమైన విద్యార్థినీ, విద్యార్థులు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అడ్మిషన్ డ్రైవ్‌లో భాగంగా శుక్రవారం రాత్రి కలెక్టర్ తన చాంబర్‌లో పోస్టర్, బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు.


ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ చిత్రామిశ్రా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వివిధ కారణాలతో పాఠశాల విద్యకు దూరమైన విద్యార్థులు ఓపెన్ స్కూల్ విధానం ద్వారా తిరిగి విద్యను కొనసాగించే అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు. ఓపెన్ టెన్త్, ఇంటర్‌లో ప్రవేశాలు పొందేందుకు దరఖాస్తు చేసుకుని తమ విద్యాభ్యాసాన్ని కొనసాగించాలని సూచించారు.

విద్యను మధ్యలో నిలిపివేసిన వారు తిరిగి చదువుకోవడానికి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ మంచి వేదికగా నిలుస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఓపెన్ స్కూల్ ద్వారా విద్యను కొనసాగించి ఉన్నత విద్యకు పునాది వేసుకోవాలని, నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు.
విద్యాభ్యాసానికి వయస్సు, పరిస్థితులు అడ్డంకులు కాకూడదని, అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ తమ విద్యా లక్ష్యాలను చేరుకోవాలని ఆమె ఆకాంక్షించారు. ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాలపై గ్రామీణ ప్రాంతాల్లో మరింత విస్తృతంగా అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైనీ, ఉమ్మడి జిల్లా టీఓఎస్ఎస్ కోఆర్డినేటర్ రామడుగు రవీందర్, డీసీఈబీ సెక్రటరీ భగవంతయ్య, కో ఆర్డినేటర్ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


@లోకల్ యాడ్స్@

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు : ఆల్ ఫోర్స్ జీనియస్ స్కూల్ బండ అంకుస్ వాడ హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!