Social 1080×1350 • Multi-page
20-05-2024 BREAKING NEWS 06:36 AM
swarnodayam.com
Telugu Daily News

ఏసీబీ వలలో కమలాపూర్ తాసిల్దార్ మాధవి.. ధరణి ఆపరేటర్ రాకేష్

ఏసీబీ వలలో కమలాపూర్ తాసిల్దార్ మాధవి.. ధరణి ఆపరేటర్ రాకేష్
IMG-20240520-WA0038
  • తాసిల్దార్ కార్యాలయంలో కొనసాగుతున్న ఏసీబీ సోదలు..

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హనుమకొండ :

రైతు వద్ద లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసిబికి హనుమకొండ జిల్లా కమలాపూర్ తాసిల్దార్ మాధవి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.

కాసేపట్లో పూర్తి వివరాలు ఎసిబి అధికారులు వెల్లడించనున్నట్లు తెలిసింది. కమలాపూర్ మండలం కన్నూరు గ్రామంకు చెందిన కసరబోయిన గోపాల్ దగ్గర విరాసత్ రిజిస్ట్రేషన్ కోసం రూ.30,000 తాసిల్దార్ మాధవి డిమాండ్ చేయగా 5,000 రూపాయలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నట్టు సమాచారం. తాసిల్దార్ మాధవి తో పాటు ధరణి ఆపరేటర్ రాకేష్ కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డట్లు తెలిసింది. అధికారులు దీనిపై పూర్తి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. సదరు అధికారిపై గతంలో అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. విచారణ చెపడితే అనేక ఆసక్తికర అంశాలు బయట పడే అవకాశం ఉంది. తాసిల్దార్ ను ఏసీబి అధికారులు పట్టుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తున్న బాధితులు. తాసిల్దార్ కార్యాలయంలో మరో మూడు అవినీతి చేపలు ఉన్నాయని ఆరోపిస్తున్న బాధితులు. ప్రతి చిన్న పనికి పైసలు డిమాండ్ చేస్తున్న తాసిల్దార్ కార్యాలయ సిబ్బంది.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!