Social 1080×1350 • Multi-page
18-08-2026 BREAKING NEWS 06:09 PM
swarnodayam.com
Telugu Daily News

బీసీ ఆజాది ఫెడరేషన్ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ మహారాజ్ 376వ జయంతి వేడుకలు.

బీసీ ఆజాది ఫెడరేషన్ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ మహారాజ్ 376వ జయంతి వేడుకలు.
IMG-20260818-WA0085

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, ఆగస్టు 18: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలో సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకలు బీసీ ఆజాద్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ గడ్డపై సామాజిక సమానత్వం, ఆత్మగౌరవం, అణగారిన వర్గాల హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన మహావీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని, ఆయన జయంతి సందర్భంగా పలువురు పేర్కొంటూ నూతన స్ఫూర్తిని నింపారు.

ముందుగా పట్టణంలోని సైదాపూర్ క్రాస్ రోడ్ లో గల సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనముగా నివాళులు అర్పించారు. ఆయన చూపిన ధైర్యం, నాయకత్వ లక్షణాలు, ప్రజల కోసం చేసిన పోరాటాన్ని వక్తలు గుర్తు చేసుకున్నారు. సాధారణ కుటుంబం నుంచి ఎదిగి, తన కాలంలో ఉన్న సామాజిక అసమానతలకు ఎదురోడ్డి ప్రజల ఆత్మగౌరవం కోసం నిలబడిన పాపన్నగౌడ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీసీ ఆజాది ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిలుకమారి శ్రీనివాస్,
డివిజన్ అధ్యక్షుడు పంజాల తిరుపతిగౌడ్ మాట్లాడుతూ….“పోరాటం ఉన్న చోటే మార్పు పుడుతుంది” అనే స్ఫూర్తిని పాపన్న గౌడ్ జీవితం మనకు అందిస్తుందని తెలిపారు. నేటి యువత ఆయన జీవిత చరిత్రను తెలుసుకుని, సమాజంలో ఐక్యత, సమానత్వం, సేవాభావం పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీసీ ఆజాద్ ఫెడరేషన్ మండల ఉపాధ్యక్షుడు కొలిపాక క్రాంతికుమార్, ప్రధాన కార్యదర్శి మామునూరి ప్రవీణ్, పద్మశాలి సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ సంగం సత్యనారాయణ, చేనేత ఐక్యవేదిక మహిళా ఉపాధ్యక్షురాలు దేవసాని ప్రియదర్శిని, టౌన్ అధ్యక్షురాలు యేముల పుష్పలత, పద్మశాలి సంఘం నాయకులు మార్త రవీందర్, మంచికట్ల కమలాకర్, కుడికాల ప్రభాకర్, పిట్ట శ్రీనివాస్, చంద్రగిరి కుమార్ తదితరులు పాల్గొన్నారు.


&& లోకల్ యాడ్స్ &&

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: కాకతీయ జూనియర్ కళాశాల హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!