Social 1080×1350 • Multi-page
18-08-2026 BREAKING NEWS 08:00 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ లో ఘనంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

హుజురాబాద్ లో ఘనంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు
IMG-20260818-WA0113

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ పోరాట యోధుడు స్వర్గీయ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు హుజురాబాద్ పట్టణంలో గౌడ సంఘం బీసీ జేఏసీ బీసీ ఆజాది ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. మంగళవారం హుజూరాబాద్ పట్టణంలోని సైదాపూర్ క్రాస్ రోడ్ వద్ద గల సర్వాయి పాపన్న విగ్రహానికి గౌడ సంఘ నాయకులు, ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు ప్రజాసంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు.

విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని..
కేక్ కట్ చేస్తున్న చైర్పర్సన్ సుహాసిని, గౌడ సంఘం నాయకులు..
మాట్లాడుతున్న చైర్ పర్సన్ సుహాసిని..

మాట్లాడుతున్న గౌడ సంఘ నాయకుడు శ్రీపతి కుమార్

ఈ సందర్భంగా సర్వాయి పాపన్న తెలంగాణ ఖ్యాతిని కీర్తిని ప్రపంచానికి ఏ విధంగా తెలియజేశారు అనే విషయాన్ని వివరించారు. సర్వాయి పాపన్న చరిత్రను మరింత వెలుగులోకి తీసుకొని రావడానికి ప్రభుత్వం కృషి చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘ నాయకులు శ్రీపతి కుమార్, తాళ్లపల్లి రమేష్ గౌడ్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, న్యాయవాది ముక్కెర రాజుగౌడ్, చందుపట్ల జనార్ధన్, చీకట్ల సమ్మయ్య, పంజాల నాగరాజు, పాక సతీష్, కొత్తూరు రమేష్, సందెల వెంకన్న, రఘుచారి, ఇలాసాగరపు వీరస్వామి, శ్రీధర్, సమ్మయ్య, సారయ్యగౌడ్, తదితరులు పాల్గొన్నారు.
–చెల్పూర్ లో…
హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామంలో సాల్వాయి పాపన్నగౌడ్ 376వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కస్తూరి, బిఆర్ఎస్ మహిళా నాయకురాలు అకినపల్లి శిరీష, శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, గౌడ సంఘం నాయకులు పంజాల వెంకన్నగౌడ్ తదితరులు పాల్గొన్నారు.


@@లోకల్ యాడ్స్ @@

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: కాకతీయ జూనియర్ కళాశాల హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!