Social 1080×1350 • Multi-page
19-08-2026 BREAKING NEWS 03:54 PM
swarnodayam.com
Telugu Daily News

హుజూరాబాద్‌లో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం.. కేక్ కట్ చేసి, మిఠాయిల పంపిణీ.

హుజూరాబాద్‌లో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం.. కేక్ కట్ చేసి, మిఠాయిల పంపిణీ.
IMG-20260819-WA0110

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్, ఆగస్టు 19: హుజురాబాద్
పట్టణంలోనీ డిసిఎంఎస్ కాంప్లెక్స్ వద్ద ‘ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం’ వేడుకలు స్థానిక ఫోటో & వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు తలకొక్కుల ప్రసాద్ జెండా ఆవిష్కరించారు. అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్, అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు బండ శ్రీనివాస్ తో కలిసి ప్రతినిధులు, సభ్యులు కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగురె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం అతిథులు మాట్లాడుతూ.. ​సమాజంలో ఫోటోగ్రఫీ ప్రాధాన్యతను చాటిచెప్పారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ఫోటోగ్రఫీ రంగం కొత్త పుంతలు తొక్కుతోందని, కాలంతో పాటు చెరిగిపోని జ్ఞాపకాలను, సమాజంలోని సత్యాలను ప్రపంచానికి చూపే శక్తి ఒక్క క్లిక్‌కే ఉందని వక్తలు కొనియాడారు.
ఫోటోగ్రఫీ రంగంలో సుదీర్ఘ సేవలు అందించిన సీనియర్ ఫోటోగ్రాఫర్ ఐత రాజేందర్ ను, వచ్చిన అతిథులను అసోసియేషన్ ప్రతినిధులు శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఫోటోగ్రాఫర్, వీడియో గ్రాఫర్లు అసోసియేషన్ అధ్యక్షుడు తలకొక్కుల ప్రసాద్, ప్రధాన కార్యదర్శి చిరంజీవి గౌడ్, ఉపాధ్యక్షుడు యాకుబ్ అలీ, ఎడ్ల కుమారస్వామి, కోశాధికారి మధుకర్, జిల్లా నాయకులు బింగి మురళి, భాషబోయిన రాజేష్, ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కాయిత రాములు, కామనీ రవీందర్, ఫోటోగ్రాఫర్లు మాడ రవీందర్ రెడ్డి, వోడపల్లి రాజు, రాజేషు, రాజేంద్రప్రసాద్, చక్రపాణి, బొప్ప నరేందర్, బండి రమేష్, బిక్షపతి, అశోక్, సుధాకర్, పేరాల మోహన్, సృజన్ కుమార్, సొల్లు యాదగిరి, యూనియన్ బాధ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!