Social 1080×1350 • Multi-page
19-08-2026 BREAKING NEWS 05:53 PM
swarnodayam.com
Telugu Daily News

సినీ పక్కిలో నిలిపి ఉన్న ఆటోలోంచి రూ. రెండు లక్షలు చోరీ.. – దొంగల కోసం పట్టణంలో గాలిస్తున్న పోలీసులు.

సినీ పక్కిలో నిలిపి ఉన్న ఆటోలోంచి రూ. రెండు లక్షలు చోరీ.. – దొంగల కోసం పట్టణంలో గాలిస్తున్న పోలీసులు.
IMG-20260819-WA0160

మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని కరీంనగర్ వరంగల్ ప్రధాన రహదారిలోని ఇండియన్ బ్యాంకు ఎదురుగా నిలిపి ఉన్న టాటా ఏసీ ఆటోలోని రెండు లక్షల నగదును గుర్తు తెలియని దొంగలు ద్విచక్ర వాహనంపై వచ్చి కళ్ళు మూసి తెరిచేలోగా సినీ పక్కిలో దొంగిలించడం పలువురిని విస్మయానికి గురిచేసింది. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాయికల్ కు చెందిన గుంపుల సంతోష్ యాదవ్ వరంగల్ రోడ్ లోని తాజ్ రెస్టారెంట్ పక్కన ఉన్న ఇండియన్ బ్యాంక్ ఎటిఎంలో రెండు లక్షల రూపాయలు విత్ డ్రా చేసి ఏపీ 15 వై1569 టాటా ఏసీ ఆటోలో పెట్టి గ్లాసు ఎక్కించి టీ తాగుతుండగా ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఒకరు బండిపై ఉండగా మరొకరు టాటా ఏసీ వద్దకు వెళ్లి గ్లాసులు పగలగొట్టి అందులో పెట్టిన రెండు లక్షల నగదును తీసుకొని ఇద్దరు కలిసి బైక్ పై పరారయ్యారు. బాధితుడు టీ తాగి వచ్చి చూసే సరికి ఆటోలో ఉంచిన డబ్బులు కనిపించకపోవడంతో ఎదురుగా బ్యాంకు సిసి ఫుటేజ్ పరిశీలించగా ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి డబ్బులు దొంగిలించి తీసుకువెళ్లడం స్పష్టంగా రికార్డు అయింది. వెంటనే వందకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వగా హుజురాబాద్ బ్లూకోట్ పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి సిసి ఫుటేజ్ ను సేకరించారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దొంగల కోసం సిసి ఫుటేజ్ లు సేకరించే పనీలో పడ్డారు. ఏది ఏమైనా మిట్ట మధ్యాహ్నం ఇద్దరు దొంగలు ద్విచక్ర వాహనంపై వచ్చి రెండు లక్షల నగదును దొంగలించడం పట్టణంలో సంచలనం కలిగించింది. దొంగల కోసం పోలీసులు పట్టణ మొత్తం గాలింపు చర్యం చేపట్టారు.

రెండు లక్షలు నగదును ఇదే ఆటోలో కెళ్ళి ఎత్తుకెళ్లిన దొంగలు..

Oplus_16908288

రెండు లక్షలు దొంగిలించి బైక్ పై వెళ్తున్న ఇద్దరు దొంగలు..

చుట్టుపక్కల వారిని ఆరధిస్తున్న బాధితుడు సంతోష్ యాదవ్..

సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న బ్లూ కోర్టు పోలీసులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!