Social 1080×1350 • Multi-page
20-08-2026 BREAKING NEWS 07:55 PM
swarnodayam.com
Telugu Daily News

రూపారెడ్డి మృతికి సంతాపంగా హుజురాబాద్ లో క్యాండిల్ ర్యాలీ

రూపారెడ్డి మృతికి సంతాపంగా హుజురాబాద్ లో క్యాండిల్ ర్యాలీ
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: విద్యార్థుల చేతిలో అమానుషంగా హత్యకు గురైన నల్గొండ జిల్లాకు చెందిన ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్‌ రూపారెడ్డి మృతికి సంతాపంగా, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ గురువారం హుజూరాబాద్ అంబేద్కర్‌ చౌరస్తా వద్ద ట్రస్మా ఆధ్వర్యంలో క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు, ఉపాధ్యాయులు కొవ్వొత్తులు చేతబూని ర్యాలీ నిర్వహించి రూపారెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, నైతిక విలువలు పెంపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు కోరం సంజీవరెడ్డి, పట్టణ అధ్యక్షుడు వకుళభరణం వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పారెడ్డి రవీందర్‌రెడ్డి, కోశాధికారి కోటేశ్వర్, కరస్పాండెంట్ ఎం.నారాయణరెడ్డి, మాడిశెట్టి ప్రసాద్, కిరణ్, బి.రాజ్‌కుమార్, వేణుమాధవ్, షాజు థామస్, పి.సతీష్‌తో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!