Social 1080×1350 • Multi-page
22-08-2026 BREAKING NEWS 04:34 PM
swarnodayam.com
Telugu Daily News

తెలంగాణ వైతాలికుడు, సంఘ సంస్కర్త హైదరాబాద్ కొత్వాల్ రాజా బహుదూర్ వెంకటరాంరెడ్డి సేవలు చిరస్మరనీయం. – ఓసి జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.

తెలంగాణ వైతాలికుడు, సంఘ సంస్కర్త హైదరాబాద్ కొత్వాల్ రాజా బహుదూర్ వెంకటరాంరెడ్డి సేవలు చిరస్మరనీయం. – ఓసి జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.
IMG-20260822-WA0075

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ వైతాలికుడు, సంఘ సంస్కర్త,విద్యా వ్యాప్తికి విశేష కృషి చేసిన దాన శీలి, నాటి హైదరాబాద్ కొత్వాల్ నేటి పోలీస్ కమీషనర్ గా పేరొందిన రాజా బహదూర్ వెంకట్ రాం రెడ్డి పేద విద్యార్థులకు చేసిన సేవలు చిరస్మరనీయం అని ఓసి జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు పేర్కొన్నారు.
రాజా బహదూర్ వెంకట్ రాంరెడ్డి 157వ జయంతి సందర్బంగా కరీంనగర్ లో శనివారం ఎస్.ఆర్.ఆర్ డిగ్రీ కాలేజీ ఎదురుగా హైవే ప్రధాన కూడలి వద్ద నెలకొల్పిన వెంకట్ రాం రెడ్డి విగ్రహానికి, ఓసీ జేఏసీ నాయకులతో కలిసి పోలాడి రామారావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్బంగా పోలాడి రామారావు మాట్లాడుతూ రాజా బహదూర్ వెంకట్ రాంరెడ్డి బ్రిటిష్ హయంలో హైదరాబాద్ లో నగర పోలీస్ కొత్వాల్ గా ఇప్పటి పోలీస్ కమీషనర్ హోదాలో పనిచేసి సామాన్య ప్రజలకు విశేష సేవలు అందించారని అనంతరం హైదరాబాద్ నడి ఒడ్డున రెడ్డి కాలేజీ, హిస్టల్ నెలకొల్పి అందులో ఓసీ ల్లోని పేద విద్యార్థులతో పాటు అన్ని వర్గాల పేద విద్యార్థులకు ఉచిత విద్యా, హాస్టల్ భోజనం సౌకర్యం కల్పించి ఎందరో పేద విద్యార్థుల భవిష్యత్ కు బంగారు బాటలు వేసి దాన శీలిగా ఆయన అందించిన సేవలు చిరస్మరనీయం అని పోలాడి రామారావు కొనియాడారు. ఈ కార్యక్రమం లో ఉమ్మడి జిల్లా, రాష్ట్ర ఓసీ ఐకాస నాయకులు పెండ్యాల కేశవరెడ్డి, బండ గోపాల్ రెడ్డి, పెండ్యాల రాంరెడ్డి, జున్నుతుల రాజిరెడ్డి, ఏనుగు చొక్కారెడ్డి, బీరెడ్డి కరుణాకర్ రెడ్డి, కొత్తకొండ రవీందర్ రావు, అండెం రమణారెడ్డి, జిల్లా అంజయ్య, వేముల సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!