Social 1080×1350 • Multi-page
24-08-2026 BREAKING NEWS 05:33 PM
swarnodayam.com
Telugu Daily News

జర్నలిస్టులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం..- కాంగ్రెస్ నేత వొడితల ప్రణవ్..- ప్రజా ప్రభుత్వంలో జర్నలిస్టుల సంక్షేమానికి కృషి.. – నిమ్మరసం ఇచ్చి రిలే నిరాహారదీక్షలను విరమింపజేసిన ప్రణవ్.

జర్నలిస్టులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం..- కాంగ్రెస్ నేత వొడితల ప్రణవ్..- ప్రజా ప్రభుత్వంలో జర్నలిస్టుల సంక్షేమానికి కృషి.. – నిమ్మరసం ఇచ్చి రిలే నిరాహారదీక్షలను విరమింపజేసిన ప్రణవ్.
IMG-20260824-WA0044

—అర్హులైన ప్రతి జర్నలిస్టును ఆదుకుంటాం.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రజా ప్రభుత్వంలో జర్నలిస్టులకు పెద్ద పీట వేస్తున్నామని, అర్హులైన ప్రతి జర్నలిస్టును ఆదుకుంటామని వారి ఇళ్ల పట్టాలకు సంబంధించి పూర్తిస్థాయిలో సహకరిస్తామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ హామీ ఇచ్చారు. సోమవారం రోజున హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో రిలే నిరాహారదీక్ష స్థలిని ప్రణవ్ సందర్శించారు.

అనంతరం నిమ్మరసం ఇచ్చి రిలే నిరాహారదీక్షలను విరమింపజేశారు.ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అసంపూర్తిగా ఇచ్చిన పట్టాలను మరల న్యాయపరమైన ఇబ్బందులు కలగకుండా చూస్తామని, జర్నలిస్టులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని, కౌన్సిలర్లు, పట్టణ, మండల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!