Social 1080×1350 • Multi-page
25-08-2026 BREAKING NEWS 06:03 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ మున్సిపల్ అభివృద్ధికి నిధులు కేటాయించండి. – మంత్రి పొన్నంను కలిసి వినతి పత్రం అందజేసిన ఇంచార్జి ప్రణవ్, మున్సిపల్ పాలకవర్గం.

హుజురాబాద్ మున్సిపల్ అభివృద్ధికి నిధులు కేటాయించండి. – మంత్రి పొన్నంను కలిసి వినతి పత్రం అందజేసిన ఇంచార్జి ప్రణవ్, మున్సిపల్ పాలకవర్గం.
IMG_20260825_180121

—సానుకూలంగా స్పందించిన మంత్రి..

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపల్ అభివృద్ధికి నిధులు కేటాయించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసినీ, వైస్ చైర్ పర్సన్ అంజలి, కౌన్సిలర్లు మంగళవారం రోజున సైదాపూర్ మండల పరిధిలోని ఆకునూరు గ్రామంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.

బల్దియా అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోవడంతో సానుకూలంగా స్పందించిన మంత్రి తప్పకుండా నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని, వైస్ చైర్ పర్సన్ అంజలి, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!