Social 1080×1350 • Multi-page
26-08-2026 BREAKING NEWS 07:15 PM
swarnodayam.com
Telugu Daily News

ఎస్‌ఆర్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్‌లో ఘనంగా ఓనం వేడుకలు

ఎస్‌ఆర్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్‌లో ఘనంగా ఓనం వేడుకలు
IMG_20260826_191311

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కేరళ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఓనం పండుగను పురస్కరించుకుని ఎస్‌ఆర్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో ఓనం వేడుకలను ఘనంగా, ఉత్సాహభరితంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ అనుష్ రెడ్డి, డైరెక్టర్ శ్రీజారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందితో కలిసి ఓనం వేడుకల్లో పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తుల్లో విద్యార్థులు పాల్గొని కేరళ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా వేడుకలను నిర్వహించారు.

ఈ సందర్భంగా చైర్మన్ అనుష్ రెడ్డి మాట్లాడుతూ.. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలను విద్యార్థులకు పరిచయం చేయడం ద్వారా వారిలో సాంస్కృతిక అవగాహన పెంపొందుతుందని తెలిపారు. విద్యతో పాటు సంస్కృతి, సంప్రదాయాలకు కూడా కళాశాలలో సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.

డైరెక్టర్ శ్రీజారెడ్డి మాట్లాడుతూ, ఓనం పండుగ ఐక్యత, సోదరభావం, ఆనందానికి ప్రతీక అని అన్నారు. విద్యార్థులు వివిధ సంస్కృతులను గౌరవిస్తూ వాటి గొప్పతనాన్ని తెలుసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు సంప్రదాయ ఓనప్పూక్కలం (పూల అలంకరణ), సాంప్రదాయ నృత్యాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకలను మరింత సందడిగా మార్చారు. కళాశాల ప్రాంగణం పండుగ వాతావరణంతో కళకళలాడింది.

ఓనం వేడుకల్లో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకున్నారు. వేడుకలను విజయవంతంగా నిర్వహించిన కళాశాల యాజమాన్యాన్ని విద్యార్థులు అభినందించారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!