హుజూరాబాద్‌లో ఈనెల 30న ‘సౌత్ ఇండియా కరాటే ఛాంపియన్‌షిప్’ పోటీలు

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్, ఆగస్టు 27: హుజూరాబాద్ పట్టణంలోని BSR గార్డెన్‌లో ఈనెల 30 (ఆదివారం) రోజున “సౌత్ ఇండియా కరాటే ఛాంపియన్‌షిప్” పోటీలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ పోటీలకు సంబంధించిన ముఖ్య వివరాలు:
పాల్గొనే రాష్ట్రాలు: తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల నుండి సుమారు 600 మందికి పైగా క్రీడాకారులు పాల్గొననున్నారు.
వసతి & భోజన సదుపాయాలు: పోటీలకు హాజరయ్యే విద్యార్థులకు, కరాటే మాస్టర్లకు మరియు వారితో పాటు వచ్చే తల్లిదండ్రులకు ఉచిత భోజన, వసతి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
ఈ టోర్నమెంట్ సమాచారాన్ని తెలంగాణ WFSKO ఉపాధ్యక్షులు & చీఫ్ ఆర్గనైజర్ భూసారపు బాపురావు, సీనియర్ కరాటే మాస్టర్ అడ్వైజర్ బత్తుల సమ్మయ్య, మరియు జిల్లా అధ్యక్షులు & నేషనల్ ఛాంపియన్ రోంటాల రాజకుమార్ లు సంయుక్తంగా వెల్లడించారు. ఈ కరాటే పోటీలను విజయవంతం చేయాలని స్థానిక ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు వారు విజ్ఞప్తి చేశారు.


