Social 1080×1350 • Multi-page
28-08-2026 BREAKING NEWS 11:54 PM
swarnodayam.com
Telugu Daily News

ప్రేమానురాగాల మధ్య రాఖీ పండుగ వేడుకలు..- అంబేద్కర్ దేవుడన్నయ్యకు రాఖీ కట్టిన చెల్లెలు

ప్రేమానురాగాల మధ్య రాఖీ పండుగ వేడుకలు..- అంబేద్కర్ దేవుడన్నయ్యకు రాఖీ కట్టిన చెల్లెలు
IMG-20260828-WA0230

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయినా రాఖీ పండుగ వేడుకలు శుక్రవారం ప్రేమానురాగాల మధ్య ఘనంగా జరిగాయి. రాఖీ పండుగ ను పురస్కరించుకుని తమ సోదరునికి వద్దకు సోదరి, సోదరి వద్దకు సోదరుడు వెళ్లి రాఖీ వేడుకలను జరుపుకున్నారు. తమ ఇంటికి రాఖీ కట్టడానికి వచ్చిన సోదరిని ప్రేమతో సోదరులు ఆహ్వానించి మిఠాయిలు తినిపించి రాఖీ కట్టినా అనంతరం కానుకలు ఇచ్చి పంపారు. ఉదయం నుండి కుటుంబ సభ్యులు దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయాలకు భారీ సంఖ్యలో ప్రజలు రావడంతో దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి.

—ప్రయాణికులతో నిండిన బస్టాండ్లు
రాఖీ పండుగ సందర్భంగా తమ కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లడానికి ప్రజలు భారీ సంఖ్యలో ప్రయాణాలు చేస్తుండడంతో హుజురాబాద్ బస్టాండ్ ప్రయాణికులతో నిండిపోయింది. ప్రజల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. హుజురాబాద్ బస్టాండ్ లో ప్రయాణికుల సౌకర్యార్థం ప్రయాణికుల డిమాండ్ ఉన్న రూట్ కు బస్సులను వేయడానికి ఆర్టీసీ ప్రత్యేక సిబ్బందిని నియమించారు. వారు బస్టాండ్ లో ఉండి ప్రయాణికులు ఏ వైపు ఎక్కువగా ఉంటే ఆ వైపు బస్సులను పంపించే ప్రయత్నం చేశారు.

అంబేద్కర్ దేవుడన్నయ్యకు రాఖీ కట్టిన చెల్లెలు

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణ కూడలిలో ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత, బాబాసాహెబ్ అంబేద్కర్ దేవుడన్నయ్య కు రాఖీ కట్టి తమ రుణం తీర్చుకున్నారు
బీసీ ఎస్సీ ఎస్టీ jac మరియు ధర్మ సమాజ్ పార్టీ పట్టణ కన్వీనర్ మాటూరి మౌనిక, కాసర్ల రేవతి, విన్య మాధురి, సహస్ర, సుశ్రీత , పద్మ, శారద తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!