Social 1080×1350 • Multi-page
29-08-2026 BREAKING NEWS 05:25 PM
swarnodayam.com
Telugu Daily News

వచ్చే నెల1 నుండి3 వరకు అంగన్వాడీ టీచర్ పోస్టులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్

వచ్చే నెల1 నుండి3 వరకు అంగన్వాడీ టీచర్ పోస్టులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న 16 అంగన్వాడీ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సెప్టెంబర్ 1 నుండి 3వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని సిడిపిఓ సుగుణ ఒక ప్రకటనలో తెలిపారు. సైదాపూర్ మండలంలోని గొడిశాల-1, గొడిశాల-2, సైదాపూర్-1, సైదాపూర్-2, హుజరాబాద్ మండలంలోని శాలపల్లి అంగన్వాడి టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సెప్టెంబర్ 1 న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని తెలిపారు.
హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని కుమ్మరి వాడ, సైదాపూర్ మండలం దుద్దెనపల్లి-1, సర్వాయిపేట అంగన్వాడి అభ్యర్థులకు 2న సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని పేర్కొన్నారు.
హుజురాబాద్ మండలం గొల్లపల్లి, ఇల్లందకుంట మండలం గడ్డివానిపల్లి, వీణవంక మండలం కొత్తపల్లి, జమ్మికుంట మండలం గోవిందాపూర్, నాగంపేట, మొల్లపల్లి, వడ్డెరవాడ అంగన్వాడీ కేంద్రాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వచ్చే నెల మూడో తేదీన సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు హాజరు కావాలని తెలిపారు.
అభ్యర్థులు తమకు నిర్దేశించిన తేదీల్లో ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటలలోగా హుజురాబాద్ కెసి క్యాంపులో గల దమ్మక్కపేట రోడ్డులోని సిడిపిఓ కార్యాలయానికి అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావలసిందిగా సూచించారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!