Social 1080×1350 • Multi-page
30-08-2026 BREAKING NEWS 05:39 PM
swarnodayam.com
Telugu Daily News

అనుమతి లేకుండా జంబిరెడ్డి 2 సినిమాలో ఉపయోగించిన పాటను తొలగించాలని పోలీసులకు ఫిర్యాదు.

అనుమతి లేకుండా జంబిరెడ్డి 2 సినిమాలో ఉపయోగించిన పాటను తొలగించాలని పోలీసులకు ఫిర్యాదు.
IMG-20260830-WA0066

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: నేను సొంతంగా రచించి, పాడి రూపొందించిన పున్నమ్మ పున్నమ్మ పాటను తన అనుమతి లేకుండా జంబిరెడ్డి 2 సినిమాలో ఉపయోగించారని తెలంగాణ ఉద్యమ గాయకురాలు తేలు విజయ ఈరోజు కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో సిఐ ని కలిసి ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా తేలు విజయ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, బతుకమ్మ పండుగకు సంబంధించిన ఎన్నో పాటలను తాను స్వయంగా రచించి, పాడి ప్రజలలోకి తీసుకు వెళ్లినాను, ఉద్యమ సమయం నుండి ఇప్పటి వరకు బతుకమ్మ పండుగ వచ్చిందంటే తెలంగాణ ఆడపడుచుల కోసం‌ అనేక పాటలను రూపొందిస్తున్నాను అన్నారు. నేను ఎంతో కష్టపడి రూపొందించుకున్న పున్నమ్మ పున్నమ్మ పాటను మా అనుమతి లేకుండా జంబిరెడ్డి 2 సినిమాలో ఉపయోగించడం వల్ల మా యొక్క హక్కులకు, మనోభావాలకు భంగం కలిగిందని తేలు విజయ పేర్కొన్నారు. మా అనుమతి లేకుండా పాటను సినిమాలో ఉపయోగించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలనీ, అదేవిధంగా నా పాటను సినిమాలో నుండి వెంటనే తొలగించాలని కరీంనగర్ ఒకటోవ పోలిస్ స్టేషన్ లో స్టేషన్ ఆఫిసర్ కి ఫిర్యాదు ఇవ్వడం జరిగిందన్నారు.

తేలు విజయకు మద్దతుగా తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఎన్నో వేదికల మీద తన గొంతు ద్వారా ఉద్యమానికి ఊపిరి పోసిన గాయకురాలు తేలు విజయక్క పాటను దొంగతనంగా వాడు కోవడం తెలంగాణ ప్రాంత కళాకారుల పట్ల ఇప్పటికీ ఆంద్ర పెత్తనం నటిస్తుంది అనటానికి ఈ సంఘటనే నిదర్శనం అని అన్నారు.

తెలంగాణ రక్షణ సేన కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జ్ లింగంపల్లి నాగరాజు మాట్లాడుతూ రచయితలు, కళాకారుల సృజనాత్మక హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అనుమతి లేకుండా కళాకారుల సృష్టిని ఉపయోగించే ఘటనలపై అధికారులు సమగ్రంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన జిల్లా ప్రధాన కార్యదర్శి మ్యాకల తిరుపతి, జిల్లా సీనియర్ నాయకులు రంగరవేణి లక్ష్మణ్, కుతాడి శ్రీనివాస్, శ్రీరాముల రమేష్, గాలిపల్లి రత్నాకర్ చారి, గర్షకుర్తి విద్యాసాగర్ తదితరులు ఉన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!