Social 1080×1350 • Multi-page
30-08-2026 BREAKING NEWS 06:07 PM
swarnodayam.com
Telugu Daily News

ఇచ్చిన హామీల అమలుకు 8న చేపట్టే రాష్ట్ర వ్యాప్త రెడ్ల నిరసన దీక్షకు ఓసీ జేఏసీ మద్దతు. – జాతీయ అధ్యక్షులు పోలాడి రామారావు.

ఇచ్చిన హామీల అమలుకు 8న చేపట్టే రాష్ట్ర వ్యాప్త రెడ్ల నిరసన దీక్షకు ఓసీ జేఏసీ మద్దతు. – జాతీయ అధ్యక్షులు పోలాడి రామారావు.
IMG-20260830-WA0084

—హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: ఇచ్చిన హామీల అమలుకు వచ్చే నెల 8న హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద రాష్ట్ర రెడ్డి సంఘాల ఆధ్వర్యంలో వేలాది మందితో చేపట్టనున్న రాష్ట్ర వ్యాప్త రెడ్ల నిరసన దీక్షలో ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో సంఘీభావంగా పాల్గొని తాము మద్దతు తెలుపుతున్నట్లు ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తెలిపారు.
ఆదివారం కరీంనగర్ లో శ్రీనివాస్ హోటల్ లో ఉమ్మడి జిల్లా, రాష్ట్ర ఐకాస నాయకులతో నిర్వహించిన సమావేశంలో పోలాడి రామారావు పాల్గొని మాట్లాడారు.

రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం నేటి వరకు నిధులు కేటాయించ లేదని, పాలక వర్గాన్ని ప్రకటించలేదని, ఇతర ఓసీల కార్పొరేషన్ లకు సైతం పూర్తిస్థాయి పాలక వర్గాలను ఏర్పాటు చేయలేదని నిధులు కేటాయించలేదని తక్షణమే రెడ్డి కార్పొరేషన్ కు వేయి కోట్ల నిదులు కేటాయించి పాలక వర్గాన్ని ఏర్పాటు చేయాలని రామారావు డిమాండ్ చేశారు. ఇతర ఓసీ లకార్పొరేషన్ లకు పూర్తిస్థాయి పాలక వర్గాన్ని ఏర్పాటు చేసి నిధులు కేటాయించి, అన్ని విభాగాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లన అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగులో ఉన్న 12 వేల కోట్ల విద్యార్థుల ఫీజు రియింబర్స్మెంట్ బకాయి నిధులు విడుదల చేయాలని, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న వేలాది ఉద్యోగాలను భర్తీ చేయాలని, రైతు భీమాను కొనసాగించాలని రామారావు డిమాండ్ చేశారు. ఇట్టి డిమాండ్ల సాధనకు వచ్చే నెల 8న రాష్ట్ర రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో వేలాది మందితో ఇందిరా పార్కు వద్ద చేపట్టే ఓసీల నిరసన దీక్షకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఓసీ కదలి వచ్చి విజయవంతం చేసి ప్రభుత్వం పాలకుల నిర్లక్ష్య వైఖరిని ఎండ గట్టాలని రామారావు పిలుపు ని చ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు కేతిరి మని శంకర్ రెడ్డి, అండెం రమణా రెడ్డి, రూప్ రెడ్డి సత్య నారాయణరెడ్డి, తోపుచర్ల శ్రీనివాస్ రావు, కొత్తకొండ రవీందర్ రావు, తాటి పల్లి రాజన్న, కంకణాల రాజిరెడ్డి, గన్ను నరసింహా రెడ్డి, వెలమ రఘుపతిరెడ్డి, ఉమ్మడి జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!