30-08-2026 NORMAL NEWS 10:49 PM
swarnodayam.com
Telugu Daily News
30-08-2026 10:49 PM By Mandala Yadagiri

సామాజిక సేవా రంగంలో అనుమాండ్ల శోభారాణికి డాక్టరేట్

సామాజిక సేవా రంగంలో అనుమాండ్ల శోభారాణికి      డాక్టరేట్
1006614644

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: సామాజిక సేవా రంగంలో వికలాంగుల బాలల హక్కుల కోసం అనేక సంవత్సరాలుగా విశేష సేవలందిస్తున్న స్పందన సేవా సొసైటీ అధ్యక్షురాలు, రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ మాజీ సభ్యురాలు అనుమాండ్ల శోభారాణికి డాక్టరేట్ లభించింది.

న్యూజెర్సీ యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ ఇటీవల పాండిచ్చేరిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో శోభారానికి డాక్టరేట్ ప్రధానం చేశారు. హుజురాబాద్ ప్రాంతానికి చెందిన శోభారాణి స్వయంగా దివ్యాంగురాలైన మొక్కవోని ధైర్యంతో అన్ని అడ్డంకులను ఎదుర్కొని ఉన్నత విద్యను అభ్యసించి తనలాగా మరొక దివ్యాంగులు ఇబ్బంది పడరాదనే ఉద్దేశంతో వారికోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. మహిళల అభ్యున్నతి కోసం బాలల హక్కుల కోసం ఆమె కృషి చేసింది. ఆమెకు డాక్టరేట్ రావడం పట్ల పలువురు హుజురాబాద్ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేశారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!