Social 1080×1350 • Multi-page
31-08-2026 BREAKING NEWS 07:27 PM
swarnodayam.com
Telugu Daily News

రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని ఏబీవీపీ వినతి

రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని ఏబీవీపీ వినతి
IMG_20260831_192617

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : రాష్ట్రంలోని విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు సోమవారం తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి సాయి చరణ్ రెడ్డి మాట్లాడుతూ…రాష్ట్రవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోవడంతో పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను తక్షణమే విడుదల చేసి, కళాశాలలకు బకాయిలు చెల్లించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు రాకేష్, కుమారస్వామి, కృష్ణ, మణిప్రీతం, కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!