Telugu Daily News
మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ :
హుజురాబాద్ పట్టణంలోని మైనార్టీ మహిళలు సోమవారం కుట్టు మిషన్లను ఎమ్మెల్యే పాడీ కౌశిక్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుట్టు మిషన్ తో మహిళలు స్వయం ఉపాధి పొందాలని ఆకాంక్షించారు. చైర్ పర్సన్ రోoటాల సుహాసిని మాట్లాడుతూ… కుట్టు మిషన్ల ద్వారా ఉపాధి పొందడం ద్వారా కుటుంబాలు బాగుపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో హుజరాబాద్ ఆర్డీవో నాయక్ వాడి జల కుమారి, తాసిల్దార్ జక్కని నరేందర్, కౌన్సిలర్లు,తదితరులు పాల్గొన్నారు.

