Social 1080×1350 • Multi-page
31-08-2026 BREAKING NEWS 09:07 PM
swarnodayam.com
Telugu Daily News

బీసీ ఆజాది ఫెడరేషన్ నేత పంజాల తిరుపతి గౌడ్ కుమారుని నిశ్చితార్థం

బీసీ ఆజాది ఫెడరేషన్ నేత పంజాల తిరుపతి గౌడ్ కుమారుని నిశ్చితార్థం
1006627622

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (హనుమకొండ): బీసీఆజాది ఫెడరేషన్ హుజురాబాద్ డివిజన్ అధ్యక్షులు పంజాల తిరుపతి గౌడ్ కుమారుని నిశ్చితార్థ వేడుకలు హనుమకొండ ఎర్రగట్టు గుట్ట సమీపంలోని మిత్ర ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగాయి.
​ఈ వేడుకకు బీసీ ఆజాది ఫెడరేషన్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కుడికాల భాస్కర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జినుకల లక్ష్మణరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిలుకమరి శ్రీనివాస్ తదితర ముఖ్య నేతలు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.


​నూతన జీవితంలోకి అడుగుపెడుతున్న జంటకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని నాయకులు ఆకాంక్షించారు. తిరుపతి గౌడ్ కుటుంబ సభ్యులకు తమ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు మరియు శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.

కాబోయే నూతన వధూవరులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!