Social 1080×1350 • Multi-page
01-09-2026 BREAKING NEWS 02:44 PM
swarnodayam.com
Telugu Daily News

వంట గ్యాస్ వాడకంలో అవగాహన మరింత అవసరం. – తెలంగాణ వంటగ్యాస్ డీలర్ల సంఘం అధికార ప్రతినిధి పి.వి.మదన్ మోహన్‌

వంట గ్యాస్ వాడకంలో అవగాహన మరింత అవసరం. – తెలంగాణ వంటగ్యాస్ డీలర్ల సంఘం అధికార ప్రతినిధి పి.వి.మదన్ మోహన్‌
IMG-20260901-WA0018

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : వంటగ్యాస్ వాడకంపై కస్టమర్లు అవగాహన కలిగి వుంటే గ్యాస్ ప్రమాదాలకు అవకాశం వుండదని తెలంగాణ వంటగ్యాస్ డీలర్ల సంఘం అధికార ప్రతినిధి హుజురాబాద్ అంబుజా గ్యాస్ ఏజన్సీస్ అధినేత పి.వి.మదన్ మోహన్ అభిప్రాయ పడ్డారు.

మాట్లాడుతున్న పీవీ మదన్..
విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న పీవీ మదన్మోహన్..

హుజురాబాద్ టెట్రా పాఠశాలలో విద్యార్థులకు ఇండేన్ వంటగ్యాస్ వాడకం, జాగ్రత్తలు, పొదుపు అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని అంబుజా గ్యాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఒకటో తేదిన ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ఏర్పడి 62 సంవత్సరాలని‌ భారతదేశంలో 50% కన్న ఎక్కువగా కస్టమర్లు కలిగిన సంస్థగా కస్టమర్లకు నాణ్యమైన సేవలు అందిస్తున్న ఏకైక సంస్థగా అభివర్ణించారు.
యుద్ద నేపథ్యంలో అన్ని అవాంతర పరిస్తితులను తట్టుకొని కస్టమర్లకు ఏ మాత్రం ఆలస్యం కలగకుండా సిలిండర్లు అందించిన
ఏకైక సంస్థ ఐఓసియల్.. వంటగ్యాస్ వాయు ద్రవరూపంలో సిలిండర్లలో వుంటుందని పెద్ద కుటుంబ అవసరాలకు అనుగుణంగా 14.2 కిలోల గ్రుహోపకర సిలిండర్లు అందుబాటులో వున్నాయని.. మారుతున్న కాలానికి అనుగుణంగా చిన్న కుటుంబ అవసరాల కొరకు పది కిలోల ఫైబర్ సిలిండర్లు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.
వంట గ్యాస్ లీకేజి వాసన గమనిస్తే వెంటనే 1906 టోల్ ఫ్రీ నంబరు ద్వారా ఫిర్యాదు చేయాలని,
స్వయం మరమ్మత్తులు చేయరాదని కోరారు.
కిచన్ ప్లాట్ పాంలు విధిగా వుండాలని స్టౌలు ప్లాట్ఫాంపై వుండేట్లు చూడాలని‌ మదన్ మోహన్ సూచించారు.అదే విధంగా మంటలకు ఆస్కారం వున్న వస్తువులు వంటగదిలో న వుండరాదని కోరారు. సిలిండర్ పొందే సమయంలో ఓటిపి వివరాలను ఇవ్వాలని కోరారు.
సురక్ష రబ్బరు హోస్ విధిగా వాడాలని కాలపరిమితి ఐదు సంవత్సరాలు..
దానిపై తయారీ తేది కాలపరిమితి ముగింపు తేది ముద్రించబడి వుంటాయని పేర్కొన్నారు..
అగ్ని ప్రమాదాల నివారణకు ఫైర్ బాల్స్ అందుబాటులో వున్నాయని తెలుపారు.
గ్యాస్ లీకేజిని‌ గమనిస్తే ఎటువంటి విద్యుత్ స్విచ్ లను ఆన్ చేయడం ఆఫ్ చేయడం లాంటి చర్యలకు దూరంగా వుండాలని కోరారు.
అత్యవసర గ్యాస్ కనెక్షన్లు కావాలనుకునేవారు పదికిలోలు,ఐదుకిలోల FTL కనెక్షన్లు నాన్ సబ్సిడీ పొంవచ్చని సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న
కరాటే రమేశ్ మాట్లాడుతూ వంటగ్యాస్ వాడకంలో మెళుకవలపై విద్యార్థులకు స్థానిక అంబుజా ఏజన్సీ అవగాహన కల్పించడం వల్ల వారు తమ ఇల్లలోని‌ పెద్దలకు సమాచారం అందచేయడం గ్యాస్ ప్రమాదాలకు అవకాశం వుండదని తెలిపారు…
పాఠశాల ప్రధానచార్యులు నరేశ్ తాను గ్యాస్ కనెక్షన్ సుదీర్ఘ కాలంగా వాడుతున్నప్పటికీ ఈ అవగాహన కార్యక్రమం వల్ల మరిన్ని కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం కలిగిందని తెలిపారు. మరికొంతమందికి‌ గ్యాస్ అవగాహన కల్పించేందుకు తాను కృషి చేస్తానని‌ తెలిపారు.
ఈ సందర్భంగా విద్యార్థులు కార్యక్రమ నిర్వహణపై స్పందించారు‌..
ఈ కార్యక్రమంలో మేనేజర్ దేవేందర్ రెడ్డి,సీనియర్ సాప్ట్ వేర్ సిబ్బంది పవన్, గోదాం కీపర్ ప్రభు, డెలివరీ సిబ్బంది కుమార్ ప్రభుతులు పాల్గొన్నారు‌. అంతకు ముందు ఇండియన్ ఆయిల్ గీతాన్ని విద్యార్థులకు వినిపించారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!