Social 1080×1350 • Multi-page
01-09-2026 BREAKING NEWS 06:19 PM
swarnodayam.com
Telugu Daily News

ఉద్యోగ వ్యతిరేక విధానాలను ప్రభుత్వం వదులుకోవాలి. – ఉద్యోగ విద్రోహ దినం పాటించిన జేఏసీ

ఉద్యోగ వ్యతిరేక విధానాలను ప్రభుత్వం వదులుకోవాలి.  – ఉద్యోగ విద్రోహ దినం పాటించిన జేఏసీ
IMG-20260901-WA0058

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉద్యోగ రిటైర్డ్ ఉద్యోగుల వ్యతిరేక విధానాలను మానుకోవాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని నిరసనలు ఆందోళనలు జరిపారు. బుధవారం హుజురాబాద్ పట్టణంలోని రెవెన్యూ కార్యాలయం ఎదుట రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిపారు. ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని ఇప్పుడున్న సిపిఎస్ ను రద్దు చేయాలని మన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిరంకుశ వైఖరి అవలంబించడం దారుణం అన్నారు. పెన్షనర్లకు ప్రభుత్వం నుండి రావలసిన బకాయిలను ఇవ్వకుండా చోద్యం చూస్తుందని అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది రిటైర్డ్ ఉద్యోగులు మానసికక్షోభకు గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే ఉద్యోగ, పెన్షనర్ల జేఏసీ తరఫున ఆందోళనను తీవ్రతరం చేస్తామని అన్నారు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల ముందు ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెన్షనర్ల విద్రోహ దినాన్ని పాటించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మహ్మద్ ఉస్మాన్ పాషా, గంజి జయవర్ధన్, దుర్గాజీ, చంద్ర సేన, సొల్లు సారయ్య, వి గోపాలరావు, ఉద్యోగ సంఘ నాయకులు పోలంపల్లి ఆదర్శన్ రెడ్డి, మేరీ శోభారాణి, సంజీవ్, పవన్ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!