ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు

—వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు
—వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా వృద్ధులకు పండ్ల పంపిణీ
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతిని పురస్కరించుకొని హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బోర్ణపల్లిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించి, వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఆనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి నాయకుడు భారత దేశంలోనే లేరని, పార్టీలు చూడకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా ప్రతి సంక్షేమ పథకాన్ని గడప గడపకు అందించిన మహోన్నత వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. అలాంటి గొప్ప నాయకుడు మన మధ్య లేకపోవడం బాధాకరమని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన రామ రాజ్యాన్ని తలపించిందని తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా ఎందరో విద్యార్థులు ఉన్నత శిఖరాలను అందుకున్నారని, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వారు ప్రాణాలను కాపాడుకున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

