Social 1080×1350 • Multi-page
02-09-2026 BREAKING NEWS 08:54 PM
swarnodayam.com
Telugu Daily News

9 నుండి 11 వరకు హుజురాబాద్ లో ఎస్జీఎఫ్ క్రీడలు.. -ఎంఈఓ శ్రీనివాస్

9 నుండి 11 వరకు హుజురాబాద్ లో ఎస్జీఎఫ్ క్రీడలు.. -ఎంఈఓ శ్రీనివాస్
1006652832

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఈనెల తొమ్మిదవ తేదీ నుండి 11వ తేదీ వరకు హుజురాబాద్ మండల ఎస్ జి ఎఫ్ క్రీడలు నిర్వహిస్తున్నట్లు హుజురాబాద్ మండల విద్యాధికారి వీ శ్రీనివాస్ అన్నారు. బుధవారం హుజూరాబాద్ ఎంఆర్సి లో ఎస్జిఎఫ్ క్రీడల నిర్వహణపై ఫిజికల్ డైరెక్టర్లు పీఈటీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. మండల స్థాయి ఎస్.జి.ఎఫ్ క్రీడలు హుజురాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహించడం జరుగుతుందని, కబడ్డీ, కోకో, వాలీబాల్ క్రీడల్లో బాల బాలికలను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు.
మండల ఎస్జీఎఫ్ కన్వీనర్ చిరుత శ్రీనివాస్ మాట్లాడుతూ… మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. ఈ సమావేశంలో పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!